Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎర్నాకులం » వాతావరణం

ఎర్నాకులం వాతావరణం

నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య సమయం సందర్శనకు అనుకూలం. ఈ నగరం ప్రతి ఏటా న్యూ ఇయర్, క్రిస్మస్ సమయంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. నగరంలో ఏప్రిల్, మే నెలలు అత్యంత వేడి మాసాలు కావడం వల్ల, ఈ సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం సరైనది కాదు.

వేసవి

ఎర్నాకులంలో వేసవి పొడిగా, భరించలేని వేడిగా ఉంటుంది. బైట నగరాల నుండి వచ్చే ప్రజలు నగరంలో ఆర్ద్రతను, వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా భావిస్తారు. వేసవి ఏప్రిల్, మే మాసాలలో చాలా అధికంగా ఉంటుంది. ఎర్నాకులం సందర్శనకు ఇది సరైన సమయం కాదు.

వర్షాకాలం

ఎర్నాకులం లో వర్షాకాలాలు అందాన్ని విస్తృతంగా అందించడం వల్ల అక్కడి జీవితం స్థిరత్వాన్ని అందిస్తుంది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల సమయంలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయి. వర్షాకాలం ఈ నగరాన్ని దట్టమైన పచ్చదనం తో నింపుతుంది కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి, స్థల సందర్శనకు కష్టంగా కూడా ఉంటుంది.

చలికాలం

అదృష్టవశాత్తూ, ఏర్నాకులంలోని భౌగోళిక ప్రదేశం శీతాకాల మాసాలైన డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలలో సందర్శకులకు ట్రీట్ ఇస్తుంది. ఈ సమయంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది, అందరికీ బహుసా సాయంకాల సమయంలో తేలికపాటి జాకెట్ అవసరముంటుంది. ఈ సమయంలో మీరు నీటి క్రీడలు, బైటి కార్యకలాపాలకు మీ ప్రేమలో తేలికగా మునిగిపోతారు.