Search
  • Follow NativePlanet
Share

ఈరోడ్ – పరిశ్రమలు, వ్యవసాయ౦ వున్న ప్రాంత౦!

29

తమిళనాడు లోని ఈరోడ్ జిల్లా ప్రధాన కేంద్రం ఈరోడ్ నగరం. చెన్నై కి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలోను, వాణిజ్య కేంద్రమైన కోయంబత్తూర్ కి పడమరగా 100 కిలోమీటర్ల దూరంలోను, భవానీ, కావేరి నదుల ఒడ్డున దక్షిణ భారత ద్వీపం మధ్యలో వున్న నగరం ఈరోడ్. మరమగ్గాలపై నేసిన బట్టలకు, చేనేత ఉత్పత్తులకు, రెడీమేడ్ దుస్తులకు ఈరోడ్ ప్రసిద్ది పొందింది. అందువల్లే దీన్ని ‘టెక్స్ వేలీ ఆఫ్ ఇండియా ‘ అని కూడా అంటారు. దుప్పట్లు, లుంగీలు, తువ్వాళ్ళు, కాటన్ చీరలు, దోతీలు, కార్పెట్లు, ప్రింట్ చేసిన దుస్తులు ఇక్కడ టోకుగా అమ్ముతారు, పండుగ సమయాల్లో ఐతే దుస్తుల వ్యాపారులు బాగా గడిస్తారు. ఈ ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. పసుపు సాగు కు కూడా ఈ నగరం ప్రసిద్ది పొందింది.

ఈరోడ్ లోను, పరిసరాలలోనూ పర్యాటక కేంద్రాలు

తిండాల్ మురుగన్ దేవాలయం, పెరియ మారియమ్మన్ దేవాలయం, ఆరుద్ర కబలిశ్వరార్ దేవాలయం, కస్తూరి అర౦గనాథార్ దేవాలయం, మహిమలిశ్వరార్ దేవాలయం, నటాద్రీశ్వరార్ దేవాలయం, పరియూర్ కొండత్తు కాలియంమన్ దేవాలయం ఈ నగరంలో భక్తులు ఏడాది పొడవునా సందర్శించే దేవాలయాలు. ఈరోడ్ లో సెయింట్ మేరీస్ చర్చి, బ్రౌ చర్చి లాంటి అందమైన చర్చిలను కూడా చూడవచ్చు. భవానిసాగర్ ఆనకట్ట, కోడివేరి ఆనకట్ట పర్యాటకులు చూసి తీరాల్సిన ప్రదేశాలు. పెరియార్ స్మారక భవనం, వేల్లోడ్ పక్షి అభయారణ్యం, ప్రభుత్వ మ్యూజియం, కరదియూర్ వ్యూ పాయింట్, భవాని, బన్నారి ఇక్కడ చూడతగిన ఇతర ప్రదేశాలు.

ఈరోడ్ నగర చరిత్ర

క్రీ.శ.850 ప్రాంతాల్లో ఈరోడ్ కార్స్ వంశ రాజుల పాలనలో వుండేది. క్రీ.శ.1000 నుంచి 1275 మధ్య చోళులు దీన్ని పరిపాలించారు – 1276 తర్వాతా ఇది పడియార్ల అధీనంలోకి వచ్చింది. ఈ కాలంలో వీరపాండ్యన్ అనే రాజు కళింగ రాయన్ కాల్వ తవ్వించడం మొదలు పెట్టాడు. తర్వాత ముస్లింలు, అటుపైన మదురై రాజుల పాలన వచ్చింది. తర్వాత టిప్పు సుల్తాన్, హైదర్ అలీ ఈ నగరాన్ని పాలించగా, 1799 లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన హస్తగతం చేసుకుంది.

ఈరోడ్ అనే పేరు “ఈర ఓడు” అనే పదాల నుంచి వచ్చింది – అంటే “తడి పుర్రెలు” అని అర్ధం. ఈ పేరు వెనక ఒక కథ వుంది. దక్ష ప్రజాపతి కూతురు దాక్షాయణి ని శివుడి కిచ్చి పెళ్లి చేసారు. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేశాడు. దీనికి శివుడిని తప్ప అందరినీ ఆహ్వానించాడు.

ఐతే, దాక్షాయణి యజ్ఞం చూడాలనుకుంది, ఐతే ఆమె భర్త మహాశివుడు అందుకు అంగీకరించలేదు. భర్త అభ్యంతరం చెప్పినప్పటికీ ఆమె యజ్ఞానికి వెళ్ళింది – ఐతే ఆమెను తల్లిదండ్రులు గానీ ఇతరులు గానీ పలకరించలేదు. ఈ అవమాన భారంతో ఆవిడ తనకు తానుగా యజ్ఞ గుండంలో దూకి కాలి బూడిదయింది. ఇది విని శివుడు ఆగ్రహోదగ్రుడై యజ్ఞ శాలకు వెళ్లి బ్రహ్మ దేవుడితో సహా అందరినీ దండించాడు.

ఈ సంఘటన తరువాత చనిపోయినవారి ఎముకలు, పుర్రెలు కావేరి నదిలో పారేశారు, దాంతో అవి ఇప్పటికే తడిగానే ఉండిపోయాయి. అందువల్ల ఈర ఓడు అనే పేరు అంటే తడి పుర్రెలు.

ఈరోడ్ వాతావరణం

సాధారణంగా ఈరోడ్ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది, వర్షపాతం సంతృప్తికర౦గా ఉండదు. ఫిబ్రవరి, మార్చి నెలలలో ఈ ప్రాంత వాతావరణం ప్రత్యేకంగా కావేరి నది పక్కన సాధారణంగా చాలా తేమతో కూడా ఉంటుంది. ఏప్రిల్ నెలలో వాతావరణం మరింత వేడిగా మారి, గరిష్ట తేమను కల్గి ఉంటుంది. జూన్, జూలై, ఆగష్టు నెలలలో పాల్ఘాట్ అంతరం గుండా చల్లటి గాలి వీస్తుంది, ఈరోడ్ ప్రాంతానికి వచ్చేసరికి కాని ఈ చల్లటి ప్రభావం తగ్గిపోయి వాతావరణం వెచ్చగా, దుమ్ముగా ఉంటుంది.

ఈరోడ్ చేరడం ఎలా

ఈ నగరానికి కోయంబత్తూరు విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. ఈ నగరం అద్భుతమైన రోడ్లతో ముఖ్య నగరాలకు మార్గాన్ని కల్గి ఉంది. నగరానికి దగ్గరగా ఈరోడ్ జంక్షన్ రైలు స్టేషన్ ఉంది. ఈరోడ్ నగర బస్ స్టేషన్ నుండి అన్ని పర్యాటక గమ్యస్థానాలకు బస్సు సౌకర్యం ఉంది. పర్యాటకులకు అందుబాటులో ఉన్న ఆటో రిక్షాలు, టాక్సీలు, సైకిల్ రిక్షాల ద్వారా నగరంలో ప్రయాణించవచ్చు.

ఈరోడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఈరోడ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఈరోడ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఈరోడ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా బెంగుళూర్, కోయంబత్తూర్, చెన్నై, కొచ్చి, త్రివేండ్రం వంటి భారతదేశంలోని వివిధ ప్రధాన పట్టణాల నుండి ఈరోడ్ కి రోడ్డుమార్గం ద్వారా తేలికగా చేరుకోవచ్చు. ఈరోడ్ లో ప్రైవేట్ బస్సులు, టాక్సీలు తేలికగా అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు ట్రావెల్ ఏజెంట్ల సహాయంతో ఈరోడ్ లోనూ, నగరం బైట అద్దె టాక్సీలలో ప్రయాణం చేయవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా భారతదేశం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులు ఈరోడ్ నగరాన్ని రైలు ద్వారా చేరుకోవచ్చు. రైల్వే వ్యవస్థ అద్భుతంగా ఉంది, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ళు రెండూ భారతదేశంలోని అనేక ప్రధాన పట్టణాల నుండి నడుస్తున్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ఈరోడ్ నగరం నుండి దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూర్ ఈ ప్రాంతానికి సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun