Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గుల్మార్గ్

గుల్మార్గ్ - మాత గౌరీ మార్గ పేరుతో...!

54

గుల్మార్గ్ పట్టణం జమ్మూ & కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లాలో సముద్ర మట్టానికి 2730 అడుగుల ఎత్తున కలదు. ఈ పట్టణాన్ని బ్రిటిష్ వారు 1927 లో కనిపెట్టారు. గుల్మార్గ్ అనే పదానికి అర్ధం చెప్పాలంటే 'పూవుల మార్గం ' అని చెప్పాలి. గుల్మార్గ్ ను మొదటగా హిందువుల దేవుడు శివుడు భార్య అయిన మాత గౌరీ పేరుతో గౌరీ మార్గ అనేవారు. అయితే ప్రస్తుత పేరు కాశ్మీర్ ను చివరగా పాలించిన యూసఫ్ షా చాక్ ఈ ప్రదేశ్ అందాలకు ముగ్ధుడై అక్కడ కల పచ్చని ఏటవాలు ప్రదేశాలు, ప్రశాంత వాతావరణం చూసి దానికి గుల్మార్గ్ అని నామకరణం చేసాడు.

పర్యాటకులు ఇక్కడ ఆఫర్వాట్ శిఖరం నుండి కరిగిన మంచు ఒక 'నింగ్లె నల్లా' అనే ప్రవాహంగా ప్రవహించా టాన్ని తప్పక చూడాలి. ఈ ప్రవాహం పర్వతం నుండి కిందకు పడి అక్కడ కల జీలం నది లో సోపోరే వద్ద కలుస్తుంది. టూరిస్టులు ఈ ప్రవాహాన్ని ఒక బ్రిడ్జి పై మరో పర్యాటక ఆకర్షణ అయిన ఖిలన్ మార్గ వద్ద దాటవచ్చు. కాశ్మీర్ వెళ్ళే సందర్శకులకు కాశ్మీర్ వాలీ లో 'అవుటర్ సర్కిల్ వాక్ ' తప్పక సిఫార్సు చేయదగినది ఈ నడకలో పర్యాటకులు ఆ ప్రదేశం యొక్క సహజ అందాలను, ప్రపంచంలోనే నాలుగవ అతి ఎత్తు శిఖరం గా పేరు పడ్డ , సుమారు 8500 మీటర్ల ఎత్తుగల నన్గా పర్బాత్ ను, తప్పక ఆనందించగలరు.

ఆహ్లాదకర వాతావరణం, అద్భుతమైన ప్రదేశాలు, వికసించే పూవుల గార్డెన్ లు , దట్టమైన పైన్ అడవులు, అందమైన గుల్మార్గ్ సరస్సులు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వాతావరణ ప్రశాంతత , అక్కడ కల పచ్చని దట్టమైన చెట్ల ప్రదేశాలు ఈ ప్రదేశాన్ని ఒక పిక్నిక్ స్పాట్ మరియు నివాస ప్రదేశం గాను మార్చాయి. నింగ్లె నల్లా, వేరినాగ్, మరియు ఫిరోజ్పూర్ నల్లా లు ఇక్కడ ప్రసిద్ధి చెందిన ప్రవాహాలు. వేరినాగ్ యొక్క స్వచ్చమైన, చల్లని నీరు ఔషధ గుణాలను కలిగి ఎంతో మంది పర్యాటకులను ఆ ప్రవాహం వద్దకు ఆకర్షిస్తుంది. పర్యాటకులు ఇక్కడే కల ప్రసిద్ధ బయో స్పియర్ రిజర్వు ను కూడా చూడవచ్చు.

ఇటీవలి కాలం లో గుల్మార్గ్ లో కనిపెట్టబడిన ద్రంగ్ అనే అందమైన ప్రదేశం ఒక రోజు పిక్నిక్ స్పాట్ గా పని చేస్తుంది. సందర్శకులు ప్రదేశ అందాలను ఆనందించటమే కాదు, ఇక్కడ చేపలను కూడా పట్టవచ్చు. గుల్మార్గ్ లో , లీన్ మార్గ మరొక సుందర ప్రదేశం. పైన్ అడవులు మరియు వివిధ రకాల పూవులు కల ఈ ప్రాంతం సైట్ సీఇంగ్ మరియు బస చేయటానికి ఎంతో బాగుంటుంది.

సందర్శకులు గుల్మార్గ్ కు సుమారు 13 కి.మీ. ల దూరంలో కల ఆల్ పత్తర్ లేక్ ను కూడా చూడవచ్చు. ఈ లేక్ యొక్క ప్రాధాన్యత అంటే అది సంవత్సరం పొడవునా సుమారు జూన్ మధ్య వరకు గడ్డ కట్టి వుంటుంది. వేసవి లో ఆ మంచు కరిగి మంచు ముక్కాలతో సహా నీరు వాలీ లోకి ప్రవహిస్తుంది. మంచుతో కప్పబడిన ఈ పర్వత శ్రేణులు అద్భుతంగా వుంటాయి.

గుల్మార్గ్ లో కేబుల్ కార్ సిస్టం అయిన గొండోలా రైడ్ మరొక ఆకర్షణ. టూరిస్టులు రెండు నుండి అయిదు కి.మీ.ల రైడ్ ఎంచుకోవచ్చు. ఒకటి గుల్మార్గ్ నుండి కొంగ్దూర్ మరి ఒకటి కొంగ్దూర్ నుండి అఫర్వాట్. ఆకాశంలో నుండి చూసే హిమాలయా శిఖరాలు, గొందోలా గ్రామం అద్భుతంగా వుంటాయి. కొంగ్దూర్ లోని గొండల ప్రదేశం సుమారు 3099 మీటర్ల ఎత్తు కాగా, అఫార్వాట్ 3979 మీటర్ల ఎత్తున కలదు. సైట్ సీఇంగ్ లో గొందోలా రైడ్ ఎంచుకోవచ్చు.

గుల్మార్గ్ లో ఇంకా చూడవలసిన పర్యాటక ఆకర్షణలు అంటే, బాబా రిషి స్థలం, ఫిషింగ్ పాండ్, బానిబాల్ నాగ కౌటార్ నాగ, మరియు సోనా మార్గ లు. ఈ ప్రదేశాలన్నీ ఒక రోజు పిక్నిక్ లకు బస లకు సరిపోతాయి. సోనా మార్గ ను 'బంగారు ప్రదేశం ' అని కూడా అంటారు. ఇది అమరనాథ్ గుహ చూడాలనుకునే వారికి ఒక బేస్ గా వుంటుంది. ఇవే కాక లడఖ్ మరియు జోజిలా ప్రదేశాలను కూడా శ్రీనగర్ - లెహ్ మార్గం లో చూడవచ్చు.

సందర్శకులు గుల్మార్గ్ కు సంవత్సరం లో ఎపుడైనా వెళ్ళవచ్చు. కాని సరైన సమయం అంటే మార్చ్ నుండి అక్టోబర్ ల మధ్య. గుల్మార్గ్ కు విమానం, రైలు లేదా రోడ్ మార్గాలలో తేలికగా చేరవచ్చు.

గుల్మార్గ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గుల్మార్గ్ వాతావరణం

గుల్మార్గ్
6oC / 43oF
  • Partly cloudy
  • Wind: NE 11 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం గుల్మార్గ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గుల్మార్గ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం గుల్మార్గ్ పట్టణం జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్ మార్గం లో కలుపబడి వుంది. పర్యాటకులు ప్రభుత్వ , ప్రైవేటు బస్సు లను ఉపయోగించవచ్చు స్వంత కార్ల పై ప్రయాణించాలనుకునే వారు శ్రీనగర్ నుండి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గుల్మార్గ్ కు జమ్మూ తావి రైలు స్టేషన్ సమీపం. ఇండియా లోని నార్త్ నగరాల వారు ట్రైన్ లో నేరుగా జమ్మూ చేరవచ్చు. జమ్మూ రైలు స్టేషన్ ఇండియాలోని ముంబై, పూణే చండీగర్ వంటి పట్టణాలకు చక్కగా కలుపబడి వుంది
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    గుల్మార్గ్ పర్యటన విమానం రైలు, రోడ్ మార్గాలలో చేయవచ్చు విమాన ప్రయాణం గుల్మార్గ్ కు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. సుమారు 56 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి జీపులు, టాక్సీలలో చేరవచ్చు. శ్రీనగర్ నుండి దేశం లోని ముంబై పూనే చండీగర్ వంటి అనేక ప్రధాన నగరాలకు విమానాలు కలవు.
    మార్గాలను శోధించండి

గుల్మార్గ్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Aug,Sat
Return On
18 Aug,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Aug,Sat
Check Out
18 Aug,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Aug,Sat
Return On
18 Aug,Sun
  • Today
    Gulmarg
    6 OC
    43 OF
    UV Index: 3
    Partly cloudy
  • Tomorrow
    Gulmarg
    3 OC
    37 OF
    UV Index: 4
    Partly cloudy
  • Day After
    Gulmarg
    4 OC
    39 OF
    UV Index: 3
    Moderate rain at times