Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుంటూరు » వాతావరణం

గుంటూరు వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అలాగే ఫిబ్రవరి నెలల్లో ఈ గుంటూరు నగరాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ మాసాలలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవాడు అలాగే ఎండ తీవ్రత సాధారణంగా ఉంటుంది . ఈ మాసాలలో గుంటూరు ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమం. సాయంత్రం అలాగే రాత్రి వేళల్లో కొంచెం చలిగా ఉండడం వల్ల ఊలి దుస్తులు తీసుకువెళ్ళడం మరచిపోకూడదు.  

వేసవి

ఎండాకాలంఇక్కడ ఎండాకాలం లో ఎండలు చాలా తీవ్రంగా ఉండడమే కాకుండా వాతావరణం పొడిగా ఉంటుంది. ఫిబ్రవరి చివరలో ప్రారంభమయ్యే ఎండాకాలం జూన్ మాసం చివరి వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ మరియు మే నెలల్లో ఇక్కడ ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. ఎండాకాలంలో గుంటూరు ప్రయాణం సిఫార్సు చేయదగినది కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ మాసాలలో గుంటూరులో వర్షాకాలం ఉంటుంది. ఉష్ణమండల వాతావరణం వల్ల, అక్టోబర్ అలాగే సెప్టెంబర్ నెలలలో తేలికపాటి జల్లులు పడతాయి. వర్షాకాలంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ వరకు నమొదవుతుంది. వర్షం పాడినప్పుడు ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.  

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. జనవరి మాసాన్ని అతి శీతల మాసంగా గుంటూరులో చెప్పుకోవచ్చు. సుమారుగా 25 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదయ్యే శీతాకాలంలో చలి తీవ్రత మాములుగానే ఉంటుంది. సాయంత్రం అలాగే రాత్రి వేళల్లో చలి కొంచెం పెరుగుతుంది అంతే కానీ అత్యంత శీతలంగా మాత్రం వాతావరణం మారాడు.