Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుషైని » వాతావరణం

గుషైని వాతావరణం

ప్రయాణంకు ఉత్తమ సీజన్: గుషైని సందర్శించడానికి ఉత్తమ సమయం ఫిబ్రవరి నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో, గుషైనిలో అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.

వేసవి

గుషైని ప్రాంతంలో ఏడాది పొడవునా నాలుగు సీజన్లలో సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉంటుంది.వేసవి కాలం (జూన్ నుండి ఆగష్టు): ఈ ప్రాంతంలో వేసవి జూన్ నెల నుండి ప్రారంభమై ఆగష్టు నెల వరకు ఉంటుంది. ఇక్కడ వర్షాకాలంలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా సంభవించే ప్రమాదాలు కొండచరియలు విరిగిపడటం వంటి వాటి వల్ల ఈ ప్రదేశం సందర్శించే ప్రయాణికులు చాల జాగ్రత్తగా ఉండాలి.

వర్షాకాలం

  వసంత ఋతువు (ఏప్రిల్,మే): ఏప్రిల్ ,మే నెలల్లో వసంత ఋతువు ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత 22°C నుంచి 28°C వరకు ఉండి ఆ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రయాణికులు ఈ సీజన్లో ఈ ప్రదేశంను సందర్శించదానికి ఇష్టపడతారు. శిశిర ఋతువు (సెప్టెంబర్ నుండి అక్టోబర్): గుషైని లో శిశిర ఋతువు సెప్టెంబర్ నెలలో ప్రారంభమై అక్టోబర్ వరకు ఉంటుంది.ఇక్కడ ఈ సమయంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం ( నవంబర్ నుండి మార్చి):గుషైనిలో శీతాకాలం నవంబర్ నెల నుండి మొదలై మార్చి నెల వరకు ఉంటుంది. ఈ ప్రాంతం ఉష్ణోగ్రతలు సుమారు 5°C కు పడిపోవడంతో ఈ సీజన్లో మంచు వర్షం కురుస్తుంది. అందువల్ల ప్రయాణికులు మంచు వర్షం ఆస్వాదించడానికి ఈ సమయంలో ఈ స్థలాన్ని సందర్శిస్తారు.