పర్యటించడానికి సరైన సమయం: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో గానీ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య గానీ ఈ కొండప్రాంతాన్ని సందర్సించడానికి మంచి సమయం.
హర్శిల్ సమ శీతోష్ణ ప్రాంతం లో ఉంది. వేసవి మధ్యస్థంగా ఉన్నా చలికాలం అతి శీతలంగా ఉంటుంది. వేసవి: ఏప్రిల్ నుంచి జూలై దాకా వేసవి. ఉష్ణోగ్రత 10 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటుంది. సందర్శకులు ఎక్కువగా ఈ నెలల్లోనే ఇక్కడికి వస్తూంటారు. అయితే మంచి ఉన్ని దుస్తులు తప్పక తీసుకెళ్ళాలి.
వర్షాకాలం: జూలై నుంచి ఆగస్ట్ దాకా ఉండే ఈ వర్షాకాలం లో ఈ ప్రాంతం చాలా సౌందర్యవంతంగా ఉన్నప్పటికీ ఈ నెలల్లో పర్యాటకుకు వెళ్ళక పోవడమే మంచిది. వర్షానికి నేల ఒరిగిపోయి, రోడ్లు బ్లాక్ అయిపోయి ఇబ్బందిగా ఉంటుంది.
చలికాలం: అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఉండే ఈ చలికాలం లో 10 నుండి సున్నా డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండి, విపరీతంగా మంచు పడుతూ ఉంటుంది.