Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హేమిస్ » వాతావరణం

హేమిస్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం : ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎండాకాలం లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. అవుట్ డోర్ ఆక్టివిటీ లకి అనువుగా ఉండడం ఈ సమయం ప్రత్యేకత. శీతాకాలం లో ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ కి చేరుకునే అవకాశం ఉండడం వల్ల ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం కాదు.

వేసవి

ఏడాది పొడవునా సమశీతల వాతావరణం ఉంటుంది. ఎండాకాలం, చలికాలం ఇక్కడుండే కాలాలు. వర్షాలు తక్కువగా నమోదయ్యే ప్రాంతం ఈ హేమిస్. ఎండాకాలం (ఏప్రిల్ నుండి జూన్) : ఏప్రిల్ లో ప్రారంభమయ్యే ఎండాకాలం జూన్ నెల వరకు కొనసాగుతుంది. ఎండాకాలం లో హేమిస్ లో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్. అరుదుగా ఉష్ణోగ్రతల్ 20 డిగ్రీల సెల్సియస్ కి చేరుకోవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం : వర్షాకాలం తక్కువగా నమోదయ్యే ప్రాంతం అవడం వల్ల ఇక్కడి అడవులలో పొడి వృక్ష సంపదని గమనించవచ్చు.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) : అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు శీతాకాలం కొనసాగుతుంది. శీతాకాలం లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల సెల్సియస్. ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడం ఉత్తమం. డిసెంబర్ నెలలో భారీగా మంచు కురుస్తుంది.