Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » వాతావరణం

హైదరాబాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఎక్కువగా చలి, ఎక్కువగా వేడి లేకపోవడం వల్ల హైదరాబాద్ నగరాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం శీతాకాలం. ఉదయం పూట వాతావరణం వెచ్చగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినా చిన్నపాటి చలిని తట్టుకునేందుకు ఏవైనా ఊలి వస్త్రాలు మీతో తెచ్చుకోవడం సాయంత్రం మరియు రాత్రి పూట కలిగే చలిని తట్టుకోవచ్చు.  

వేసవి

ఎండాకాలం హైదరాబాద్ లో ఎండాకాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవవచ్చు. వేడి గా ఉండే ఎండాకాలంలో ఇంటి నుండి అడుగు బయట పెట్టడమే కష్టంగా ఉంటుంది. ఎండాకాలంలో మీ చర్మం కాంతి తగ్గడమే కాకుండా జాగ్రత్తగా ఉండకపోతే డీహైడ్రేషన్ కలిగే ప్రమాదం కూడా కలదు.  

వర్షాకాలం

వర్షాకాలం హైదరాబాద్ లో వర్షాకాలం చాలా సంతోషించదగిన సమయం. ఇక్కడి ఉష్ణోగ్రత భరించగలిగిన స్థాయిలోనే నమోదయి, వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. జూన్ చివరి నుండి సెప్టెంబర్ మధ్య వరకు వర్షాకాలం ఉంటుంది. భారీ వర్షపాతం నమోదయ్యే అవకాసం ఉంది. వర్షాకాలంలో నెల జారుగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించడం మానుకుంటే మంచిది.  

చలికాలం

శీతాకాలం హైదరాబాద్ లో అమితమైన చలికాలం ఎప్పుడూ లేదు. అయినా సాయంత్రం నుండి తెల్లవారు జామున వరకు ఇక్కడ చల్లగానే ఉంటుంది. లైట్ జాకెట్ ద్వారా హైదరాబాద్ లో చలిని తట్టుకోవచ్చు. నవంబర్ లో ప్రారంభమయిన చలికాలం జనవరి చివరి వరకు ఉంటుంది. 19 డిగ్రీల సెల్సియస్ వరకు ఇక్కడి ఉష్ణోగ్రత నమోదవుతుంది.