Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హైదరాబాద్

హైదరాబాద్ - తెలుగు దేశం యావత్తూ గర్వించదగిన నగరం!

153

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత ఖుతుభ్ షా రాజవంశీయుల లో ఒకరైన మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత 1591 లో ఏర్పాటయింది. స్థానిక స్థల పురాణం ప్రకారం భాగమతీ, మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ల ఆసక్తి కరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆస్థాన నర్తకి అయిన భాగమతి తో సుల్తాన్ ప్రేమలో పడతాడు. వారి ప్రేమకి గుర్తుగా ఖులీ ఖుతుబ్ షా ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు. ఆమె ఇస్లాం మతం లో కి మారి  హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ ని వివాహమాడారు. తదనుగుణంగా ఈ నగరం పేరు కూడా హైదరాబాద్ గా మారింది.

దక్షిణ భారత దేశం పై దండయాత్ర చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత ఈ నగరం ఆక్రమించబడే వరకు హైదరాబాద్ నగరం ఖులీ ఖుతుబ్ షా రాజవంశీకుల చేతిలోనే దాదాపు ఒక శతాబ్దం వరకు ఉంది. 1724 లో ఆసిఫ్ జహి రాజవంశాన్ని స్థాపించిన తరువాత మొదటి ఆసిఫ్ జా హైదరాబాద్ ని, చుట్టు పక్కల ప్రదేశాలని అధీనం లోకి తీసుకున్నాడు. హైదరాబాద్ నిజాములు గా ఆసిఫ్ జా రాజవంశీకులు పేరొందారు. వైభవోపేతమైన నిజాముల శకానికి సంబంధించిన ఈ సుందరమైన ప్రాంతం యొక్క ఘనమైన చరిత్ర వలసవాదుల కాలం వరకు విస్తరించింది. బ్రిటిష్ రాజులతో పరస్పర లబ్ది దార సంది కుదుర్చుకుని నిజాం వారు హైదరాబాదుని దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించారు. 1769 నుండి 1948 వరకు ఈ ప్రాంతం నిజాముల రాజధానిగా వ్యవహరించింది. ఆపరేషన్ పోలో నిర్వహించిన తరువాత ఆఖరి నిజాం పాలకుడు ఇండియన్ యూనియన్ తో జరిగిన పట్టాభిషేక ఒప్పందం పై సంతకం చేసి హైదరాబాద్ ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, స్వతంత్ర భారత దేశం లో ని భాగం గా చేసారు. సాంస్కృతిక గుర్తింపు, విలక్షనీయత హైదరాబాద్ సొంతం. తెలుగు దేశం యావత్తూ గర్వించదగిన నగరం హైదరాబాద్ నగరం.

భౌగోళికంగా హైదరాబాద్ మంచి ప్రదేశం లో ఉంది. ఉత్తర భారత దేశ భాగం పూర్తయ్యి, దక్షిణ భారత దేశం భాగం మొదలయ్యే ప్రదేశం హైదరాబాద్. అందువల్ల, హైదరాబాద్ లో రెండు విభిన్న సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తుంది. ఈ కలయిక ఎంతో  అందంగా ఉంటుంది. పూర్వపు రోజుల నుండి సాహిత్యం, సంగీతం, కళలకు హైదరాబాద్ రాజధానిగా వ్యవహరించేది. నిజానికి, నైజాముల ఆదరణవల్ల ఈ నగరంలో లలిత కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. లలిత కళ లపై అమితమైన ఆసక్తి కలిగిన నైజాములు, అర్హత కలిగిన కళాకారులని ప్రోత్సహించడంలో వెనకడుగు వేసేవారు కాదు. అంతే కాదు, ఈ రాజవంశీకులు భోజన ప్రియులు కూడా. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వంట వాళ్ళని రప్పించి ఎన్నో రుచులని వారిచేత విభిన్న రకాల వంటకాలను చేయించుకుని ఆస్వాదించేవారు. ఈ రోజు, హైదరాబాద్ లో కనిపించే విభిన్న రుచుల సమ్మేళనం దేశంలో ని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చినదే. అయినా స్థానిక వంటల రుచులు మాత్రం అన్నిటికంటే ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ తయారు చేసే హైదరాబాద్ దం బిర్యాని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వారసత్వ సంపద వారసులకి ఇచ్చినట్టు, హైదరాబాద్ లో ఉండే ప్రతి కుటుంబం ఈ వివిధ వంటకాల తయారీ విధానాన్ని తమ తరువాతి తరాలకి తెలియచేస్తున్నారు.

ఆకర్షణీయమైన పురాతన ప్రపంచపు నగరం

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల ప్రస్తుతం భారత దేశం పటం లో హైదరాబాద్ నగరం అత్యుత్తమ స్థానాన్ని పొందింది. హై టెక్ కార్పొరేట్ ఆఫీసుల లోని జీవనోపాధి కోసం దేశం లోని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ కి తరలి వచ్చి ఎంతో  మంది ఇక్కడ స్థిరపడుతున్నారు. ఎన్నో టెక్నో పార్క్స్ ఏర్పాటయినా, పురాతన ప్రపంచపు ఆకర్షణలైన మినార్స్, గాజుల మార్కెట్లు, ఖావో గలీస్ మరియు ఫోర్ట్స్ ని కాపాడుకుంటూ ఎంతో మందిని ఇక్కడికి ఆకర్షిస్తోంది. ఈ ప్రదేశాలన్నీ పురాతన కాలంలో నైజాం రాజుల మరియు ఆస్థాన నర్తకిల వైభవాలని మీకు కథలు గా చెబుతాయి. హైదరాబాద్ లోని పాత బస్తీ లోని ఒక చిన్న నడక ద్వారా చరిత్ర పుస్తకంలో కూడా ఈ ప్రదేశం గురించి కనిపించే ఎన్నో అంశాలు ఎదురవుతాయి. ఇప్పటికి, భాగమతీ, ఖులీ ఖుతుబ్ షా ల ప్రేమ కథని గోల్కొండ కోట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ, గాంభీర్యం మరియు దయలని స్థానిక ప్రజలలోగమనించవచ్చు .

హైటెక్ సిటీ

సాంస్కృతిక అస్థిత్వాన్ని కాపాడుకుంటూనే సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నఒకే ఒక్క నగరంగా ఈ హైదరాబాద్ నగరాన్ని చెప్పుకోవచ్చు. నానాటికి దేశంలోని ఇంజినీర్ల డిమాండ్ ని తట్టుకోవడానికి గత రెండు దశాబ్దాలలో ఈ నగరంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వివిధ రంగాలకి సంబంధించిన ఇంజినీర్లని ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ నగరానికి సాటి ఏ  నగరమూ లేదు. ఎన్నో బహుళ జాతి కంపెనీలు అభివృద్ధి సాధించడానికి ఇక్కడ శాశ్వతంగా ఆఫీసులని ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఏర్పాటయిన ఎన్నో ఐటి మరియు ఐటిఇయస్ కంపెనీలు దేశవ్యాప్తంగా యువతకి ఎన్నోఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యా ఉద్యోగ సంబంధిత విషయాలకోసం దేశం నలు మూలల నుండి ఎంతో మంది యువత ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆధునిక సౌకర్యాలన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. నగరం లో ని శాంతి భద్రతలని కాపాడి ప్రజలకి సురక్షిత ప్రదేశంగా రక్షణ కలిపించడంలో సామర్థ్యం కలిగిన పోలీసు బలగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సాంస్కృతిక ప్రత్యేకతని కాపాడుకుంటూనే నూతన మార్పులని అంగీకరిస్తున్న స్థానిక ప్రజల వల్లే ఈ అభివృద్ధి సాధ్యం అవుతోంది.

చరిత్రకారులు మరియు బ్యాక్ పాకర్స్ కోసం ఎన్నో వింతలు దాచి ఉంచడంతో పాటు పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటోంది  ఈ హైదరాబాద్ నగరం. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, సాలార్ జంగ్ మ్యూజియం మరియు హుస్సేన్ సాగర్ వంటివి హైదరాబాద్ లో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణలలో కొన్ని. కొన్నిసార్లు, శీతాకాలం లో కూడా ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. కాబట్టి, పర్యాటకులు వాతావరణం అనుకూలంగా ఉన్న సమయం లో నే ఇక్కడ సందర్శించడం ఉత్తమం. రైలు, రోడ్డు మరియు వాయు మార్గం ద్వారా హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంటుంది. అందువల్ల జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు ఈ ప్రాంతం తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా మారింది.(100)

హైదరాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హైదరాబాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హైదరాబాద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హైదరాబాద్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రాష్ట్రం లో ని వివిధ ప్రాంతాలకి ఇంకా ఇతర పక్క రాష్ట్రాలకి హైదరాబాద్ నగరం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదా ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఇక్కడ బస్సులు సౌకర్యంగా ఉండడమే కాకుండా నామమాత్రపు రుసుమునే తీసుకుంటాయి. ప్రైవేటు టూర్స్ మరియు ట్రావెల్స్ కంపెనీలు ఈ ప్రాంతంలో టాక్సీ సేవలని అందిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం రైళ్ళ స్ట్రింగ్ నెట్వర్క్ ల ద్వారా దేశం లో ని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి దక్షిణ రైల్వే చక్కగా అనుసంధానమై ఉంది. దక్షిణ రైల్వే ల హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ లో నే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎన్నో రైళ్ళు బయలుదేరతాయి అలాగే ఎన్నో రైళ్లు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి చేరుకుంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ నగరంలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం తరచూ హైదరాబాద్ విమానాశ్రయంలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు తిరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ లో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలు నడుపబడే రాజీవ్ గాంధీ టెర్మినల్, స్వదేశీ విమానాలు తిరిగే ఎన్ టి రామారావు టెర్మినల్. హైదరాబాద్ నుండి లేదా హైదరాబాద్ కి ప్రయనిన్చేతప్పుడు టికెట్స్ ని ముందుగానే తీసుకోవడం ఉత్తమం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun