Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » వాతావరణం

జబల్పూర్ వాతావరణం

ఉత్తమ సమయం శీతాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో ఈ ప్రాంత పర్యటన అనువుగా ఉంటుంది. ముందుగా ఈ ప్రాంత ఉష్ణోగ్రత తెలుసుకుని అలాగే ఉన్ని వస్త్రాలని వెంట తీసుకువెళ్ళడం మంచిది.

వేసవి

ఎండాకాలం ఏప్రిల్ ల మొదలయ్యే వేసవి కాలం జూన్ వరకు కొనసాగుతుంది. ఎండాకాలం లో ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. ఎండాకాలం లో ఇక్కడి ఉష్ణోగ్రత వేడిగా పొడిగా ఉంటుంది. వడగాలులు ఈ ప్రాంతం లో సాధారణం. అందువల్ల ఇళ్లలోనే ఉండటం సిఫార్సు చేయబడుతతుంది. ఈ సమయం లో ఈ ప్రాంతం సందర్శన సౌకర్యవంతంగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ చివరి వారం లో మొదలయ్యే వర్షాకాలం ఆగస్ట్ వరకు కొనసాగుతుంది. ఎండవేడిమి నుండి వర్షాలతో ప్రజలకి ఉపశమనం కలిగిస్తుంది. భారీ వర్షపాతాలు నమోదవుతాయి. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం ఆగస్ట్ నెలలో అధికంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం అక్టోబర్ చివరన ప్రారంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. కనిష్టంగా 2 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. శీతాకాలం లో వాతావరణం చల్లగా ఉంటూ ఆహ్లాదకరం గా ఉంటుంది.