Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జబల్పూర్

జబల్పూర్ టూరిజం - పాలరాతి శిలలు...ఎన్నో అద్భుతాలు !

25

మధ్యప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన నగరాలలో నర్మదా నది తీరాన ఉన్న జబల్పూర్ నగరం ఒకటి. రాష్ట్రం లోనే ప్రధాన పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతం పేరొందడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

భారత దేశం యొక్క పాలరాతి నగరంగా జబల్పూర్ ప్రసిద్ది చెందింది. ప్రపంచం లోనే ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతంగా ఇది వృద్ది చెందడానికి భేదాఘాట్ లో ఉన్న పాలరాతి శిలలు ముఖ్య కారణం. ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతాలలో ఒకటి. జబల్పూర్ కి పర్యాయపదం గా ఈ ప్రాంతం పేరు మారింది. విశ్వజనీనమైన జబల్పూర్ నగరం లో ఉన్న సైనిక ఇంకా పారిశ్రామిక రంగాల వల్ల ఆర్ధికం గా వృద్ది చెందిన నగరం గా కూడా ప్రాచుర్యం పొందింది. చరిత్ర ప్రకారం, జబల్పూర్ నగరానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. బ్రిటిష్ వారి చేతి లో కి వెళ్ళే ముందు గొండ్స్ మరియు కలిచురి వంశీకులతో పాటు మరాఠాలు ఇంకా మొఘలుల చే పాలించబడిన ప్రాంతం ఇది.

జబల్పూర్ లో ఇంకా చుట్టు పక్కల సందర్శనీయ స్థలాలు

సందర్శకులను ఆకట్టుకునేందుకు జబల్పూర్ పర్యాటకం అనేకమైన ఆకర్షణలు అందిస్తోంది. చౌసథ్ యోగిని టెంపుల్, పిసన్హరి కి మదియ మరియు త్రిపుర సుందరి ఆలయం ఇక్కడ ఉన్న ప్రధాన మందిరాలు. దుమ్నా నేచర్ రిజర్వ్ ఇక్కడున్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఏడాది పొడుగునా ఎంతో మంది జంతు ప్రేమికులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. అదే విధంగా, జబల్ పుర లో ఉన్న బర్గి డ్యాం ప్రపంచవ్యాప్తం గా పక్షి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఈ డ్యాం కి సమీపం లో ఉన్న ప్రాంతం ఇంకా దుంధర్ ఫాల్స్ ఈ నగరం లో ప్రసిద్ది చెందిన పిక్నిక్ స్పాట్స్.

తిల్వారా ఘాట్, అందమైన హనుమాన్ తాల్ ఇంకా సుందరమైన సంగ్రామ్ సాగర్ లేక్ ఇక్కడున్న ఇతర పర్యాటక ఆకర్షణలు. మదన్ మహల్ ఫోర్ట్ ఇంకా రాణి దుర్గావతి మెమోరియల్ మ్యూజియం లు ఈ ప్రాంతం యొక్క ఘనమైన గతానికి సాక్ష్యం గా నిలుస్తాయి. పూర్వ కాలపు స్మృతులు ఇంకా ఈ నగరం లో ఉన్న ప్రాచీన కోటలలో మరియు ఆలయాలలో పదిలపరచబడ్డాయి.

సంవత్సరాలుగా ఈ ప్రాంతం లోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడం లో బాలన్సింగ్ రాక్స్ తమ వంతు కృషి చేసాయి. భేదాఘాట్ లో ఉన్న పాలరాతి శిలలు ఫోటోగ్రఫీ ని ఇష్టపడే వాళ్ళకి అనువైన ప్రదేశం. కొత్తగా పెళ్ళైన జంటలకి ఈ ప్రాంతం ఇష్టమైన ప్రదేశం అవుతుంది.

జబల్పూర్ - చాట్స్ మరియు కోవా జిలేబీలు

నోరూరించే అద్భుతమైన రుచులు జబల్పూర్ సొంతం. వాటిలో చాట్స్ ఇంకా కోవా జిలేబీలని ఇక్కడ తప్పకుండా రుచి చూడాలి. జబల్ పూర్ లో ఉన్న చాట్ గల్లి వివిధ రకాలైన చాట్ ల కి ప్రసిద్ది. ఇవన్నీ ఒకే వీధిలో లభించడం వల్ల చాట్ గల్లీ అనే పేరు వచ్చింది. అందమైన సాయంత్రం చాట్స్, రబ్రీ ఇంకా కోవా జిలేబీలతో జబల్పూర్ లో హాయిగా గడపవచ్చు.

జబల్పూర్ - మధ్య ప్రదేశ్ యొక్క సంస్కార్ధని

మధ్య ప్రదేశ్ యొక్క సంస్కృతిక రాజధాని సంస్కార్దని. నగరం యొక్క సంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఈ నగరానికి నుండి వివిధ కళలు మరియు సంస్క్రుతిలలో పేరొందిన వారితో అనుబంధం ఉంది. భారత దేశ రాజ్యంగా అసలు పీఠిక ని తయారుచేయడం లో తన వంతు పాత్ర పోషించిన, అంతర్జాతీయం గా పేరొందిన బియోహర్ రామ్మనోహర్ సిన్హా అనే కళాకారుడు పేరు ఇక్కడ ప్రస్తావించుకోదగ్గది.

జబల్పూర్ - స్నూకర్ ఆట పుట్టిన ప్రదేశం

జబల్పూర్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రసిద్ది చెందిన స్నూకర్ ఆట బ్రిటిష్ వారి హయాంలో ఇక్కడే పుట్టింది. బ్రిటిష్ ల లో ప్రాముఖ్యత పొందిన బిలియర్డ్స్ ఆట 1875 లో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్స్ మెస్ వద్ద స్నూకర్ పుట్టుకకి తోవ ఇచ్చింది.

జబల్పూర్ ప్రయాణం

వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా జబల్పూర్ కి సులభం గా చేరుకోవచ్చు. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. ముంబై, ఇండోర్ మరియు ఢిల్లీ ల ని రెగ్యులర్ ఇంటర్వల్స్ లో ఫ్లైట్స్ ద్వారా అనుసంధానం చేసే దుమ్నా విమానాశ్రయం ఉంది. శీతాకాలం లో వాతావరణం ఆహ్లాదకరం గా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

జబల్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జబల్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జబల్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జబల్పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర లో ని అనేక ప్రాంతాలకు జబల్పూర్ రోడ్డు ద్వార అనుసంధానింపబడి ఉంది. ఇక్కడికి ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు తరచుగా అందుబాటులో ఉంటాయి. అంతే కాక, ప్రైవేటు టాక్సీలు కూడా లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం జబల్పూర్ లో రైల్వే స్టేషన్ ఉంది. మధ్య ప్రదేశ్ లో ని అనేక ప్రాంతాలతో పాటు దేశం లో ని ఢిల్లీ, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నై, భోపాల్ మొదలగు ఇతర ప్రాంతాలకు కూడా ఇది అనుసంధానమై ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం జబల్పూర్ లో నగర మధ్య నుండి 12 కిలో మీటర్ల దూరం లో దుమ్నా ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడికి కొన్ని విమానాలు ముంబై, ఇండోర్ మరియు ఢిల్లీ నుండి ఉంటాయి. ఢిల్లీ విమానాలు భోపాల్ మీదుగా ఇక్కడికి వస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City