Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జయంతియా కొండలు » వాతావరణం

జయంతియా కొండలు వాతావరణం

జయంతియా హిల్స్ వాతావరణం జయంతియా హిల్స్ లోని అన్ని కాలాలు అనువుగా ఉంటాయి కాబట్టి, పర్యాటకులు ఏ సమయంలోనైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. వర్షాకాలం ఒకవైపు కొండల అద్భుతాలను చూపిస్తే, శీతాకాలం, వేసవి ఈ లోయలు, కొండల మరో ప్రసాంతమైన భాగాన్ని చూబిస్తాయి. పర్యాటకులు వారి సౌకర్యానికి అనుగుణంగా యాత్రకు తేలికగా ప్రణాళిక వేయవచ్చు.  

వేసవి

వేసవి ఇక్కడ వేసవి చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి కొండలలో ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండదు. పర్యాటకులు పర్వతారోహణకు అలాగే హైకింగ్ కి అనువుగా ఉండే ఈ సమయంలో జయంతియా హిల్స్ సందర్శించడం ఉత్తమం. జయంతియా హిల్స్ లో ఈ సమయంలో చూడడానికి అనువుగా ఉండే అనేక గుహలు ఉన్నాయి.  

వర్షాకాలం

వర్షాకాలం మేఘాలయలో వర్షం సమగ్ర భాగంగా ఉండడం వల్ల జయంతియా హిల్స్ లో పుష్కలమైన వర్షపాతం కనిపిస్తుంది. వర్షాకాలం జూన్ నుండి ప్రారంభమై ఆగస్ట్-సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. అధిక వర్షపాతం కారణంగా ఈ ప్రాంతం ముఖ్యంగా మలిడోర్ సమీపంలోని సిల్చార్ మార్గంలో ప్రత్యేకంగా కొండచెరియలు కనిపించడం గమనించాలి.  

చలికాలం

శీతాకాలం జయంతియా హిల్స్ లో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రాంతం 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతతో చాలా చల్లగా ఉంటుంది. అయితే, పగలు సూర్యకాంతి వల్ల బైటి పనులకు అనువుగా ఉంటుంది.