Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జామ్ నగర్

జామ్ నగర్ - ‘సిటీ అఫ్ జామ్స్’ !

46

క్రి.శ.1540 లో జామ్ నగర్ ను జామ్ రావాల్ నావానగర్ కు రాజధానిగా కనుగొన్నారు. ఈ సిటీ ని రాన్మల్ సరస్సు ఒడ్డున మరియు రంగమతి మరియు నగ్మతి నదుల సంగమంలో స్థాపించారు. ఈ నగరాన్ని తర్వాతి కాలంలో మహారాజ కుమార్ శ్రీ రంజిత్ సిన్హాజి 1920 లలో మరోసారి పునరిద్ధరించారు. ఆ తర్వాతి కాలంలో దీనిని ‘సిటీ అఫ్ జామ్స్’ అనేవారు.‘జామ్‘ అంటే రాజు అని అర్ధం చెపుతారు.

ఈ నగరం జడేజా రాజపుత్ర పాలకులచే పాలించబడింది. వీరు శ్రీ కృష్ణుడు వంశమైన యాదవ తెగకు చెందిన వారు. శ్రీ కృష్ణుడు యాదవులను మధుర నుండి జామ్ నగర్ జిల్లా లోని ద్వారకలో రాజ్యాన్ని స్తాపించాడానికిగాను పంపాడని చెపుతారు.

మూల చరిత్ర

జామ్ రావాల్ తండ్రి అయిన జామ్ లకాజి కి బహదూర్ షా పన్నెండు గ్రామాలను బహుకరించాడు. తర్వాత, జామ్ రావాల్ కథియవార్ కు వెళ్లి అక్కడ నవానగర్ ను స్థాపించాడు. 1852 లో జామ్ విభాజి పాలనలో ఈ నగరంలో అనేక స్కూళ్ళు, ఆస్పత్రులు స్థాపించటం మరియు రైల్వే లైన్లు రాజ్ కోట్ కు వేయటంతోను నవ నగారం బాగా అభివృద్ధి చెందినది. .

మహారాజ కుమార్ శ్రీ రంజిత్ సిన్హజి

మహారాజ కుమార్ శ్రీ రంజిత్ సిన్హాజి జామ్ నగర్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక క్రికెట్ క్రీడాకారుడు. జామ్ నగర్ నిర్మాణంలో ఆయన పాత్ర ప్రముఖమైనది. ఆయన 1907 – 33 లలో ఈ ప్రాంతాన్ని పాలించాడు. 1914 సంవత్సరంలో ఒక ఆర్కిటెక్ట్ సర్ ఎడ్వర్డ్ లుతీన్స్ సహకారంతో ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయనకు యూరోపియన్ శిల్ప శైలి అంటే ప్రాణం. సిటీని ఆయన యురోపెయన్ స్టైల్ లో తిరిగి మార్పు చేసాడు. గతం లోని పురాతన శైలిని నగరంలోని వారు మార్పు చేసి తమ ఇండ్లను చక్కని రీతిలో మరో మారు నిర్మించారు. జామ్ నగర్ కు 'పారిస్ అఫ్ ఇండియా' అనే పేరు కలదు. విల్లిన్గ్దోన్ క్రేసేంట్, ప్రతాప్ విలాస్ పాలస్, సోలరియం వంటివి ఆయన కాలం లో నిర్మించారు. బెది ఓడరేవు ను మరియు రైల్వే లైన్ లను కూడా ఆయన కాలంలోనే అభివృద్ధి చేసారు. చాలా కాలం కిందట జామ్ నగర్ చిన్న పెర్ల్ ఫిషింగ్ టవున్ గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికి ఇది అక్కడ కల టై – డై మరియు బంధాని, అనే బట్టల రంగుల అద్దకపు ప్రక్రియకు ప్రసిద్ధి. గత 500 సంవత్సరాలుగా ఈ సిటీ ఈ పరిశ్రమలలో అనేక మెళకువలు సాధించింది.

సంస్కృతి

ఇక్కడి ప్రజలు, తమ నిత్యావసరాలకు కతిఅవాది భాషను ఉపయోగిస్తారు. ప్రజలలో కొద్దిమంది మాత్రం కచ్ భాష మాట్లాడతారు.

టూరిస్ట్ ఆకర్షణలు

జామ్ నగర్ లో అనేక పార్కులు, సంక్చురిలు కలవు. ఇండియాలో కల ఒకే ఒక మెరైన్ సంక్చురి అయిన మెరైన్ నేషనల్ పార్క్ జామ్ నగర్ సమీపంలో కలదు. పిరోతాన్ ద్వీపం సమీపంలో కలదు. ఖిజాడ బర్డ్ సంక్చురి, గాగ వైల్డ్ లైఫ్ సంక్చురి, పీటర్ ష్కాట్ నేచర్ పార్క్ మరియు ఇతర పర్యావరణ ప్రదేశాలు కూడా జామ్ నగర్ లో కలవు. జామ్ నగర్ లో ప్రసిద్ధి గాంచిన నాలుగు మార్బుల్ జైన టెంపుల్స్ కలవు. అవి వర్ధమాన్ షా టెంపుల్, రైసి షా టెంపుల్ ,వాసుపూజ్య స్వామీ టెంపుల్, మొదలైనవి. జామ్ నగర్ లోని బాల హనుమాన్ టెంపుల్ చాలా ప్రసిద్ధి. ఈ టెంపుల్ గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులలో కూడా రామ నామాన్ని దీర్ఘకాలం జపించినందుకు గాను 1964 ఆగష్టు ఒకటవ తేది నుండి కలదు. లఖోట టవర్ మరొక పర్యాటక ఆకర్షణ. ఇది లఖోట లేక్ ఒడ్డున జామ్ రాన్మల్జి పాలనలో కరువు నుండి విముక్తి కొరకు నిర్మించబడినది. రంజిత్సాగర్ డం, ప్రతాప్ విలాస్ పాలస్, రతన్ బై మసీద్, దర్బార్ గడ , భిద్భంజన్ టెంపుల్, ఖిజడియా టెంపుల్, బొహరా జజీరా, భుజిఒ కోతో, మానెక్ బాయి ముక్తిదాం, రాజీ పోర్ట్, బెది పోర్ట్ వంటివే మరి కొన్ని పర్యాటక ప్రదేశాలు.

జడేజా రాజపుత్ర రాజులతో మరియు ప్రసిద్ధ క్రికెటర్ రంజిత్సిన్హాజి పేరు తోను సంబంధం కల జామ్ నగర్ తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశం.

జామ్ నగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జామ్ నగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జామ్ నగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జామ్ నగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం జామ్ నగర్ గుజరాత్ లోని అన్ని నగరాలకు రోడ్ మార్గంలో కలుపబడి వుంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు రాజ్ కోట్, ద్వారక, పోర్ బందర్, అహ్మదాబాద్, భుజ్, సూరత్ మరియు ఇతర ప్రదేశాల నుండి రెగ్యులర్ గా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం జామ్ నగర్ నుండి అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, వారణాసి, కలకత్తా మరియు గోరఖ్ పూర్ లకు రైళ్ళు కలవు. సౌరాష్ట్ర ఎక్స్ ప్రెస్ మరియు సౌరాష్ట్ర మెయిల్ ట్రైన్ లు ముంబై మరియు జామ్ నగర్ ల మధ్య నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ సిటీ సెంటర్ కి 10కి. మీ. ల దూరంలో కలదు. స్థానిక విమానాలు ముంబై –జామ్ నగర్ ల మధ్య ప్రతి రోజూ నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed