Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » వాతావరణం

జేయ్పోరే వాతావరణం

శీతాకాలం జేయ్పోరే సందర్శించడానికి ఉత్తమ సమయంగా ఉంది. శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. తొమ్మిది రోజులు దసరా మరియు గ్రాండ్ శివ రాత్రి వంటి అనేక పండుగలను ఈ కాలంలో నిర్వహిస్తారు. పర్యాటకులు వచ్చి ఈ పండుగలను చూసి ఆనందించవచ్చు. అంతేకాక వాతావరణం కూడా దృశ్య వీక్షణం కోసం హాయిగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం మే లో మొదలై జూలై వరకు కొనసాగుతుంది. జేయ్పోరే లో వేసవికాలం చాలా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 38°C నుండి 45°C మధ్య ఉంటాయి. ఈ వేడి స్ట్రోక్ వల్ల ప్రజలు ఎప్పుడూమరణిస్తారని న్యూస్ ముఖ్యాంశాలలో వస్తుంది. సూర్యుని వేడి కాల్చి భస్మము చేయుట వలన వేసవిలో పర్యాటన అనుకూలం కాదు.

వర్షాకాలం

జేయ్పోరే లో వర్షాకాలం సాదారణంగా జూలై నుండి అక్టోబరు వరకు ఉంటుంది. ఈ నెలల్లో భారీ వర్షపాతం ఉంటుంది. వర్షాకాల సమయంలో జలపాతాలు చూడటానికి బాగుంటాయి. కానీ నదుల నిండిన కారణంగా ఈ సీజన్లో వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వర్షాకాలంలో జేయ్పోరే సందర్శించడం కోసం సిఫార్సు లేదు.

చలికాలం

శీతాకాలంలో జేయ్పోరే చాలా మనోహరముగా ఉంటుంది. ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందుకే ఈ సమయాల్లో ఎముక కొరికే అంతా చల్లగా ఉంటుంది. అయితే రోజు సమయంలో సగటు ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. కానీ రాత్రులు కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. ప్రయాణికులకు శీతాకాలంలో సందర్శించే ప్రణాళిక ఉంటే వారితో తగినంత శీతాకాలం బట్టలు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి.