ప్రయాణానికి సరైన సమయం శీతాకాలం లో వాతావరణం చల్లగా, సౌకర్యవంతంగా ఉండటం వల్ల, ఈ సమయంలో ఝలావర్ సందర్శించడం ఉత్తమం.
వేసవి (మార్చ్ నుండి మే వరకు): వేసవి కాలం మార్చ్, మే నెలల మధ్య విస్తరించి ఉంటుంది. ఈ సమయంలో, ఇక్కడి ఉష్ణోగ్రత 27c నుండి 42c ఉంటుంది. సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం భరించలేనంతగా ఉంటుంది.
వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ వరకు): ఝాలవర్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో వర్షపాతం కారణంగా ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత 30c ఉంటుంది.
శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు): ఝలావార్ లో శీతాకాలం డిసెంబర్, ఫిబ్రవరి మాసాల మధ్య విస్తరించి ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 25c, 10c గా నమోదవుతుంది.