Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జున్నార్ » వాతావరణం

జున్నార్ వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం జున్నార్ లో సాధారణంగా పూనే ప్రదేశంలో వలెనే  ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. చలికాలంలో చల్లగా ఆహ్లాదంగా  ఉంటుంది. కనుక ఈ ప్రాంతంలోని వింతలు విశేషాలు తెలుసుకొని ఆనందించాలంటే, చలికాలం సరైనదిగా సూచించవచ్చు.

వేసవి

జున్నార్ వాతావరణం ఎలాగుంటుంది? వేసవి జున్నార్ లో వేసవి మార్చితో మొదలై మే నెలనాటికి అంతమవుతుంది.  ఈ సమయంలో చాలా వరకు వాతావరణం పొడిగా ఉండి ఉష్ణోగ్రతలు గరిష్టం 38 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, కనిష్టం 30 డిగ్రీ సెంటీ గ్రేడ్ గాను ఉంటాయి. వేడి అధికంగా ఉండి పర్యటన అసౌకర్యంగా ఉంటుంది. సంవత్సరంలో ఏప్రిల్ మరియు మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంగా ఉంటుంది. ఈ ప్రాంతం పశ్చిమ కనుమలలో ఉండటం చేత వర్షాలు ఒక మోస్తరుగా పడతాయి.    ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీ సెంటీగ్రేడ్ గరిష్టంగాను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కనిష్టంగాను ఉంటాయి. జూన్ నెలలో వర్షాలు అధికంగా పడతాయి.

చలికాలం

శీతాకాలం జున్నార్ లో శీతాకాలం డిసెంబర్ నెల నుండి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనీసం 6 డిగ్రీ సెంటీ గ్రేడ్ నుండి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మార్పు చెందుతూంటాయి. పగలు చల్లగాను రాత్రులందు అధిక చలిగాను ఉంటుంది. ఈ సమయంలో సందర్శించేవారు ఉన్ని దుస్తులు తప్పక తీసుకు వెళ్ళాలి.