Search
  • Follow NativePlanet
Share

కడప -  విభిన్న సంస్కృతుల నిలయం !

15

రాయలసీమ ప్రాంతం లో ఉన్న మునిసిపల్ నగరం అయిన కడప, దక్షిణ భారత దేశ  రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ దక్షిణ మధ్య ప్రాంతం లో ఉంది. వాకిలి, ద్వారం, ప్రవేశ మార్గం అనబడే అర్ధాలు వచ్చే తెలుగు పదం 'గడప' నుండి కడప అనే పేరు ఈ నగరానికి వచ్చింది. కడపకి పశ్చిమవైపున ఉన్న పవిత్ర క్షేత్రం మైన తిరుమల కి ఈ నగరం ప్రవేశ మార్గం గా ఉండడం వల్ల ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. 2010 ఆంగ్లం లో Cuddapah అనబడే ఈ పట్టణం వర్ణక్రమాన్ని Kadapa గా మార్చారు.

హైదరాబాద్ నగరం నుండి ఈ నగరం 412 కిలోమీటర్ల దూరం లో ఉంది. పెన్నా నదికి అతి సమీపంలో ఈ నగరం ఉంది. నల్లమల ఇంకా పాలకొండ నడుమ ఈ నగరం ఉంది.

చోళ సామ్రాజ్యంలో ముఖ్య భాగంగా ఈ నగరం పదకొండు నుండి పద్నాలుగు శతాబ్దాల మధ్యలో పరిగణించబడింది. పద్నాలుగవ శతాబ్దం తరువాత, ఈ నగరం విజయనగర సామ్రాజ్యంలో కలిసిపోయింది. దాదాపు రెండు శతాబ్దాలు విజయనగర సామ్రాజ్యం మొత్తం గండికోట నాయకుల చేత పరిపాలింపబడింది. విజయనగర చక్రవర్తుల యొక్క గవర్నర్స్ గా వ్యవహిరించిన ఈ నాయకులు ఈ ప్రాంతం లో అనేకమైన టాంకులు అలాగే ఆలయాలు నిర్మించారు. కడప, 1565 లో గోల్కొండ ముస్లిం రాజులచేత ఆక్రమించుకోబడినది. ఎన్నో ద్రోహమైన చర్యల ద్వారా అప్పటి రాజైన చిన్న తిమ్మ నాయుడు ని ఓడించి గండికోట ని మీర్ జుమ్లా ఆక్రమించాడు. ఆ తరువాత, ఖుతుబ్ షాహీ పరిపాలకుడైన నేక్నం ఖాన్ కడప యొక్క సరిహద్దుల్ని విస్తరింపచేసి వాటిని నేక్నామాబాద్ గా పిలిచేవాడు. అయినప్పటికీ, చరిత్రకి సంబంధించిన విషయాల గురించి తెలియచేసేటప్పుడు చరిత్రకారులు 'నేక్నామాబాద్ నిజాములు' అని ప్రస్తావించడం కంటే 'కడప నిజాములు' గా నే ప్రస్తావిస్తారు. మసీదులు, దర్గాలు నిర్మించడం ద్వారా నవాబులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మరియు నిర్మాణ కళల కు ఏంతో దోహదపడ్డారు.

సుమారు 1800 సంవత్సరం  సమకాలీన  సమయంలో, బ్రిటిష్ వారు కడప ని వారి అధీనం లో కి తీసుకుని, వారి నలుగురు అధీన కలేక్టోరేట్స్ లో ఒకరికి ఈ ప్రాంతాన్ని ప్రధాన కార్యాలయంగా మార్చారు. ఈ ప్రాంతానికి ప్రధాన కలెక్టర్ అయిన సర్ థామస్ మున్రోనేతృత్వంలో ఈ ప్రధాన కార్యాలయం ఉండేది. మూడు చర్చిలని ఈ నగరం లో బ్రిటిష్ వారు నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ నగరం మున్సిసిపాల్ కార్పొరేషన్ లో భాగం అయ్యింది.

కిష్కిందకాండ

హిందూ మత ఇతిహాసమైన రామాయణం ప్రకారం, రామాయణం లోని ఏడు కాండల లో ఒకటైన కిష్కిందకాండ భాగం కడప జిల్లాలో ఉన్న వొంటిమిట్ట అనే ప్రాంతంలో జరిగింది. కడప ప్రధాన నగరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ వొంటిమిట్ట నగరం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రసిద్ది చెందిన గండి అనే గ్రామం కడప కి సమీపంలో ఉంది. హనుమంతునికి అంకితమివ్వబడిన ఈ ఆలయంలో ఉన్న హనుమంతుల వారి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీ రాముల వారే స్వయంగా మలచారని భక్తుల నమ్మకం. బాణాలు కొన్ని ఉపయోగించి హనుమంతుల వారి విగ్రహాన్ని ఒక రాతిపై శ్రీ రాములవారు మలచారని అంటారు. సీతమ్మ వారిని కనిపెట్టినందుకు హనుమంతులవారికి గౌరవార్ధం శ్రీ రాముడు ఈ విగ్రహాన్ని మలచారని అంటారు.

దీనిని రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక మజిలీ గా ప్రస్తుత కాలంలో కడప ని పేర్కొనవచ్చు. అమీన్ పీర్ దర్గా, భగవాన్ మహావీర్ మ్యూజియం, చాంద్ ఫిరా గుంబద్, దెవునికడప ఇంకా మసీద్-ఎ-అజాం వంటి ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలు ఈ ప్రాంతం లో ఉన్నాయి.

ఏడాది పొడవునా ఉష్ణ వాతావరణం ఈ ప్రాంతం లో ఉంటుంది. తీవ్రమయిన ఎండాకాలం, పాక్షికంగా ఉండే శీతాకాలం తో పాటు మూడు నెలల కాలం వరకు ఉండే వర్షాకాలం లో నమోదయ్యే సాధారణ వర్షపాతాలు ఈ కడప ప్రత్యేకత.

వాయు, రైలు, రోడ్డు మార్గం ద్వారా కడపకి సులభంగా చేరుకోవచ్చు. నగరం నడిబొడ్డు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ నగరంలో దేశీయ విమానాశ్రయం ఉంది. ముంబై - చెన్నై లైన్ లో ఉన్న రైల్వే స్టేషన్ లో అనేక రైళ్ళు తరచుగా వస్తూ ఉంటాయి. చక్కటి రోడ్డు రవాణా మార్గం ద్వారా ఈ నగరం రాష్ట్రం లో ని మిగతా నగరాలకు అనుసంధానమై ఉంది. కడపకి చేరుకునేందుకు, క్యాబ్స్ అలాగే బస్సులు అందుబాటులో కలవు.

కడప ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కడప వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కడప

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కడప

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కడప నగరానికి ఎన్నో ప్రైవేట్ బస్సులు అలాగే గవర్నమెంటు బస్సులు తరచూ తిరుగుతూ ఉంటాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ రోడ్డులు చక్కగా నిర్వహించబడతాయి. తిరుపతి, కృష్ణాపురం, విజయవాడ, గుంటూరు అలాగే హైదరాబాద్ వంటి సమీప నగరాల నుండి బస్సులు తిరుగుతూ ఉంటాయి. కర్ణాటకా మరియు తమిళ్ నాడు వంటి రాష్ట్రాలు కూడా కొన్ని ప్రత్యేక బస్సులని ఈ ప్రాంతానికి ఏర్పాటు చేసాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం దేశం లో ని మిగతా ప్రాంతాలకి రైలు మార్గం ద్వారా కడప చక్కగా అనుసంధానమై ఉంది. చెన్నై - ముంబై రైల్వే లైన్ లో ఉన్న కడప రైల్వే స్టేషన్ లో తరచూ ఈ రెండు పట్టణాల నుండి రైళ్ళు తిరుగుతూ ఉంటాయి. కడప కి దగ్గరలో ఉన్న మరొక రైల్వే స్టేషన్ కృష్ణాపురం రైల్వే స్టేషన్ మరియు తిరుపతి రైల్వే స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ప్రధాన నగరం కడప నుండి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో స్వదేశీ విమానాశ్రయం ఉంది. హైదరాబాద్ మరియు తిరుపతి నుండి మాత్రమే విమానాలు ఈ విమానాశ్రయానికి వస్తాయి. కడప నుండి 134 కిలో మీటర్ల దూరం లో తిరుపతి విమానాశ్రయం ఉంది. అయినా ఇది కూడా దేశీయ విమానాశ్రయం మాత్రమే. అతి సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న విమానాశ్రయం. కడప విమానాశ్రయం నుండి టాక్సీ లేదా ఆటో రిక్షా ద్వారా నగరానికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat