Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కాళహస్తి

శ్రీ కాళహస్తి : పవిత్ర క్షేత్రం !!

21

ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో వున్న శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి వ్యవహార నామం కాళహస్తి. దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించ బడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన వుంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరిపేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా వుంది. దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలు, శివాలయాల్లోకి శ్రీ కాళహస్తి చాలా ప్రధానమైనది. పంచభూత లింగాలున్న అయిదు క్షేత్రాలలో వాయులింగం వున్న ఈ క్షేత్రం కూడా వుంది.నిజానికి, ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి కొండ దిగువకి, స్వర్ణముఖీ నది ఒడ్డుకి మధ్య నిర్మించారు. అందువల్లే ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం గా వ్యవహరిస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ గా కూడా పిలుస్తారు.

పురాణాల్లో శ్రీకాళహస్తి :

ఈ ప్రదేశం వాయు స్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పురాణ గాఢ ప్రకారం శివుడు వాయు రూపంలో సాలీడు, నాగుపాము, ఏనుగుల భక్తిని పరీక్షించాడు. దేవుడు వాటి భక్తికి మెచ్చి వాటిని శాప విముక్తుల్ని చేసాడు, వాటికి ఇక్కడే మోక్షం వచ్చి౦దని చెప్తారు.

శ్రీకాళహస్తి ప్రస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో వుంది. స్కంద పురాణం ప్రకారం శ్రీ కాళహస్తీశ్వరుడిని పూజించడానికి అర్జునుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ శిఖరం మీద భరద్వాజ మహామునిని కలిసాడు. 3వవ శతాబ్దంలో పాలించిన సంగమ రాజుల కాలం నాటి కవి నక్కీరర్ రచనల్లో మొదటిసారిగా శ్రీకాళహస్తి ప్రస్తావన వుంది. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసంగా వర్ణించింది నక్కీరర్ కవే. ధూర్జటి అనే తెలుగుకవి ఈ పట్టణంలోనే స్థిరపడి ఈ పట్టణం మీద, శ్రీ కాళహస్తీస్వరుడి మీద శతకం రాసాడు.

భక్త కన్నప్ప :శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భక్త కన్నప్ప భక్తికి పరవశించి తన శివానందలహరి లో ప్రస్తావించారు. దేవుడి కోసం తన కంటినే త్యాగం చేసిన గొప్ప భక్తుడు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి పర్యాయపదంగా మారిపోయాడు. హిందువులకు, శివ భక్తులకు ఈ భక్తీ కథ బాగా తెలిసిందే.

విశిష్ట నిర్మాణ శైలిలో దేవాలయాలు :ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీ కాళహస్తి ప్రసిద్ది పొందింది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ, విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలి ఆ నాటి రాజుల విశిష్ట అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి.  తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు.  చాలా మంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాలూ, రాజ ప్రాసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళలో జరిపించుకునే వారని చెప్తారు. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీ కాళహస్తి లోని నూటి స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధాని కి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు.

ఒక దివ్యమైన ప్రయాణానుభూతికాళహస్తి లోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భరద్వాజ తీర్థం, కాళహస్తి దేవాలయం, శ్రీ దుర్గా దేవి గుడి ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని.

కాళహస్తి ఎప్పుడు సందర్శించాలి :ఈ పట్టణం లో వేసవి చాలా తీవ్రంగా వుంటుంది కనుక అప్పుడు కాళహస్తి సందర్శన చేయకపోవడం మంచిది.

కాళహస్తి చేరుకోవడం :కాళహస్తి రైలు రోడ్డు మార్గాల ద్వారా తేలికగానే చేరుకోవచ్చు. అద్భుత నిర్మాణ శైలితో ప్రశాంతతను అందిస్తూ వుండే దేవాలయాలు కాళహస్తికి ప్రశస్తి చేకూర్చాయి, దీనివల్ల ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రధమ ఎంపిక అవుతుంది.

 

కాళహస్తి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కాళహస్తి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కాళహస్తి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కాళహస్తి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా : రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాళహస్తికి అనేక బస్సులు నడుపుతుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, నెల్లూర్ లాంటి నగరాలకు నిత్యం బస్సులు తిరుగుతాయి. శ్రీకాళహస్తికి ప్రైవేటు బస్సులు కూడా నడుస్తున్నాయి కానీ వాటి చార్జీ కొంచే౦ ఎక్కువే వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం : బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో వుండడం వల్ల ప్రధాన రైళ్లన్నీ శ్రీకాళహస్తి లో ఆగుతాయి. ఈ పట్టణం నుంచి అనేక రైళ్ళ ద్వారా దక్షినాది లోని అనేక నగరాలకు అనుసంధానం వుంది. ఇతర స్టేషన్లలో రైళ్ళు మారకుండా నేరుగా శ్రీకాళహస్తికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా : శ్రీకాళహస్తి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో వున్న తిరుపతి ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మదురై విమానాశ్రయాల నుంచి తిరుపతికి నిత్యం విమానాలు తిరుగుతూ వుంటాయి. అక్కడి నుంచి ప్రేవైటు టాక్సీ లేదా ప్రభుత్వ బస్సు ద్వారా శ్రీ కాళహస్తి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri

Near by City