శీతాకాలం ఆహ్లాదంగా ఉండి పర్యటనకు అనుకూలం. ఈ కాలంలో మీరు చక్కని ఉన్ని దుస్తులు తప్పక తెచ్చుకోవాలి.
కామ్ షెట్ లో వేసవి నెలలు పొడి మరియు వేడి. అయితే, చుట్టు పక్కల కల పచ్చదనం వేడిని కొంతమేరకు తగ్గిస్తుంది. ఉష్ణోగ్రతలు 24 నుండి 35 డిగ్రీలవరకు మారుతూంటాయి. ఇటీవలి కాలంలో వేసవి మరింత వేడిగా ఉంటోంది.
వర్షాకాలంలో గ్లైడింగ్ లేనప్పటికి సరస్సులు , పరిసరాలు నిండుగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు 18 నుండి 28 డిగ్రీలుగా మారుతూంటాయి.
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రాత్రి వేళ 14 డిగ్రీలు గాను పగటి వేళ 24 డిగ్రీ సెల్షియస్ గాను ఉండి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కనుక ఈ సమయంలో కామ్ షెట్ పర్యటన సూచించదగినది.