Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కాంగ్రా

కాంగ్రా - దేవ భూమి !

38

హిమాచల్ ప్రదేశ్ లో ని మంజి, బెనెర్ కాలువలు కలిసే ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశం ఈ కాంగ్రా. దౌలదర్ రేంజ్ మరియు శివాలిక్ రేంజ్ ల మధ్యలో నెలకొని ఉన్నది ఈ కాంగ్రా. ఈ ప్రాంతానికి బంగంగా కాలువ అభిముఖంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి దేవ భూమి అని కూడా పిలుస్తారు. దేవభూమి అనగా దేవుళ్ళు నెలకొని ఉన్న ప్రాంతం. ఈ ప్రదేశంలో ఆర్యులకి పూర్వం ఆర్యేతరులు నివసించినట్టుగా వేదాలలో చెప్పబడినట్టుగా భావిస్తారు. గొప్ప భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో, ఇప్పటి కాంగ్రాని త్రిగర్త రాజ్యంగా ప్రస్తావించబడింది.

10 వ శతాబ్దం లో మొహమ్మద్ గజినీ దండయాత్రతో ఈ ప్రదేశం ముస్లిముల పాలనలోకి వచ్చింది. అటు తరువాత, అతి ప్రాచీన రాజ వంశీకులు అయిన కటోచ్ వంశస్తుల పాలన లోకి ఈ ప్రాంతం వచ్చింది. 1846లో కలోనియల్ ఇండియాలో భాగంగా మారిన కాంగ్రా, ఆంగ్లో- సిఖ్ ల యుద్ధం తరువాత బ్రిటిష్ పాలనలోకి ఈ ప్రాంతం వచ్చింది. 1947 భారత విభజన తరువాత ఈ ప్రాంతం పంజాబ్ లో భాగంగా మారింది. తరువాత, 1966 లో హిమాచల్ ప్రదేశ్ భూభాగంగా మార్పు చేయబడింది.

కరేరి లేక్, బగలాముఖి టెంపుల్ మరియు కాళేశ్వర్ మహాదేవ టెంపుల్ వంటి అధ్బుతమైన ఆకర్షణియ ప్రదేశాలకు పర్యాటకులు విచ్చేయవచ్చు. సముద్ర మట్టానికి 2934 మీటర్ల ఎత్తులో ఉన్న కరేరి చెరువు ను చేరుకోడానికి ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. దౌలాధర్ రేంజ్ నుండి కరిగే మంచు ద్వారా వచ్చే నీటితో ఈ చెరువు నింపబడుతుంది. కాళేశ్వర్ మహదేవ్ టెంపుల్ భూగర్భంలో ఉన్న శివ లింగం ఎంతో మంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.

గులేర్ రియసత్ యొక్క వారసత్వ సంపద హరీపూర్-గులేర్ మరియు బ్రజేశ్వరి టెంపుల్ కూడా పేరెన్నికగన్న పర్యాటక ప్రదేశాలు. బ్రజేశ్వరి దేవాలయం ఒక పుణ్య క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. అందువల్ల, ప్రతి రోజు అదిక సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. రాంసార్ కన్వెన్షన్ లో ఉన్న ఒక తడినేల మహాప్రతాప్ సాగర్ అనేకమైన వలస పక్షులని ఆకర్షించడం ద్వారా పక్షి ప్రేమికులకు ఎంతో ముఖ్యమైన ప్రాంతంగా ప్రసిద్ది చెందింది.

కాంగ్రా లో ఉన్నషాపుర్ మరియు నూర్పూర్ మధ్యలో హైవే పైన కోట్లా ఫోర్ట్ ఉంది. పర్యాటకుల లో ఈ ప్రాంతం అమితంగా ప్రసిద్ది చెందింది. చుట్టు పక్కల ఉన్న అందమైన లోయలు మరియు అద్భుతమైన దృశ్యాలు ఈ కోట పైనుండి చూసే పర్యాటకులకు చక్కటి కనువిందు కలిగిస్తాయి. గులేర్ రాజుల పోషణలో ఈ కోట నిర్మితమైంది. ఈ కోట ప్రాంగణంలో ఉన్న బాగుల్మికి ఆలయం కాంగ్రా లో ఉన్న అధిక మంది పర్యాటకులని ఆకర్షిస్తోంది.

దక్షిణ కాంగ్రా నుండి 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న మసృర్ టెంపుల్ కాంప్లెక్స్ కాంగ్రా లో ఉన్న ప్రధాన పర్యాటక మజిలీ. 10 వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ఏక శిలతో ఇండో-ఆర్యన్ శైలిలో నిర్మితమై ఉంది. అజంతా ఎల్లోరా ఆలయాల కి పోలి ఉంది. ఈ సముదాయం లో 15 ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం లోహిందువుల దైవం అయిన శ్రీ రాముడు, లక్ష్మణుడు మరియు సీతా మరియు శివుడు కొలువై ఉంటారు.

దులాధర్ రేంజ్, బ్రజేశ్వరి టెంపుల్, నదౌన్, కత్ గర్, జవాలి జి టెంపుల్, కాంగ్రా ఆర్ట్ గాలెరి, సుజన్పూర్ ఫోర్ట్, జడ్జ్ కోర్ట్ మరియు శివా టెంపుల్ లు ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. వీటితో పాటు ధర్మశాల, బెహన మహాదేవ, పాంగ్ లేక్ సాంచురీ, సిద్ధనాథ టెంపుల్, మాక్లియోడ్ గంజ్, తరాగర్హ్ పాలసు మరియు నాగర్ కోట్ ఫోర్ట్ వంటివి ప్రముఖమైన ఆకర్షణలు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ లో నిర్వహించే అంతర్జాతీయ హిమాలయన్ ఫెస్టివల్ ఈ ప్రాంతంలో జరిగే ముఖ్యమైన పండుగ. శాంతి ప్రతిపాదనలు అందించిన దలైలామా కి వచ్చిన నోబెల్ ప్రైజ్ ని పురస్కరించుకుని ఈ వేడుకని జరుపుతారు. టిబెటన్ లలో సామరస్యాన్ని ప్రోత్సహించడమే ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం.

సైట్ సీయింగ్ ల తో పాటు కాంగ్రా చేరే దారిలో ట్రెక్కింగ్ ద్వారా పర్యాటకులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలని చూసి ఆస్వాదించవచ్చు. కరేరి లేక్ మరియు మసృర్ టెంపుల్ లకి చేర్చేందుకు ఎన్నో సాహసోపేతమైన ట్రెక్కింగ్ దారులు కలవు. కాంగ్రా నుండి చంబా లోయకి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ఇందేర్హర పాస్ గా ప్రసిద్ది చెందిన లకా పాస్ మరియు మింకియాని పాస్ లు ఈ ప్రాంతంలో ప్రసిద్దమైన ట్రెక్కింగ్ దారులు. కాంగ్రా లోయలో మరిన్ని ప్రసిద్దమైన ట్రెక్కింగ్ దారులు కలవు. అవి ధర్మశాల-లకా పాస్, మక్ లియోడగంజ్-మినికియాని పాస్-చంబ, ధర్మశాల-తలంగ్ పాస్, బైజ్నాథ్-పరాయి జోట్,మరియు భీం గసుత్రి పాస్ లు కలవు.

వాయు, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. మార్చ్ లో మొదలై జూన్ వరకు కొనసాగే ఎండాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఆహ్లాదకరమైన మరియు అనుకూలమైన వాతావరణం వల్ల వర్షాకాలం కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

కాంగ్రా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కాంగ్రా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కాంగ్రా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కాంగ్రా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : అందుబాటులో ఉన్న వివిధ బస్సుల ద్వారా పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. గవర్నమెంట్ అలాగే ప్రైవేటు బస్సులు కాంగ్రా నుండి వివిధ ప్రధాన పట్టణాలైన ధర్మశాల,పాలంపూర్,పతంకోట్,జమ్మూ,అమ్రిత్సర్ మరియు చండి గర్హ్ లకు అందుబాటులో కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: కాంగ్రా నుండి 90 కిలోమీటర్ల దూరం లో ఉన్న పతంకోట్ బ్రాడ్ గాజ్ రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుండి అందుబాటు ధర లలో టాక్సీ సేవలు పర్యాటకులకి లభ్యమవుతాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి కాంగ్రా కి 2 లేదా మూడు గంటలలో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. వాయు మార్గం : కాంగ్రా నుండి 13 కిలోమీటర్ల దూరం లో ఉన్న గగ్గల్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న గగ్గల్ విమానాశ్రయం. 200 మరియు 208 కిలోమీటర్ల దూరం లో ఉన్న జమ్మూ విమానాశ్రయం అలాగే దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం(అమ్రిత్సర్) లు ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయాలు. 255 కిలోమీటర్ల దూరం లో ఉన్న చండి గర్హ్ విమానాశ్రయం నుండి ఈ ప్రాంతానికి పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. ఢిల్లీ, ముంబై మరియు పూణే ల కి ఈ విమానాశ్రయాలు చక్కగా అనుసంధానమై ఉన్నాయి. ఈ విమానాశ్రయాల నుండి అందుబాటు ధరలలో టాక్సీ లు మరియు క్యాబ్ ల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri