Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కర్నాటక

కర్నాటక రాష్ట్ర పర్యటన - సంక్షిప్తం

కర్నాటక రాష్ట్రం భారతదేశంలో నైరుతి దిశగా ఉంది. ఈ రాష్ట్రం అనేక పర్యాటక స్ధలాలు కలిగి దేశ విదేశాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్నాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగుళూరు నగరం దేశంలోని ఐ.టి. రంగానికి ఒక కేంద్ర స్ధలం కావటం వలన, కర్నాటక పర్యటనలు ఎంతో అధికం అయ్యాయి. యాత్రికులు అధికం అవటంతో, ఈ రాష్ట్రంలో అనేక కిత్త కొత్త రిసార్టులు, వాణిజ్య సంస్ధలు ఏర్పడి పర్యాటకులకు మరింత మెరుగైన అనుభూతి కలిగిస్తున్నాయి. కర్నాటకకర్నాటక రాష్ట్రం భౌగోళికంగా కోస్తాతీరం లేదా ’కరావళి‘, పర్వత ప్రాంతం లేదా పడమటి కనుమలు కల ‘మలెనాడు’ మరియు మైదానాలు లేదా ‘బయలు సీమ’ అని చెప్పబడుతున్నాయి. మరింత వర్గీకరణగా ఈ రాష్ట్రాన్ని ఉత్తర మరియు దక్షిణ కర్నాటక ప్రాంతాలుగా కూడా చెపుతారు. వాతావరణం కర్నాటక లో ప్రధానంగా నాలుగు సీజన్లు అంటే వేసవి, వర్షరుతువు, వర్షరుతువు, వసంతరుతువు మరియు చలికాలాలు. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వసంత రుతువు కాగా జనవరి, ఫిబ్రవరి నెలలు శీతాకాలంగా ఉండి పర్యటనకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

భాషలు కన్నడ భాష రాష్ట్రంలో అధికార భాష. తుళు, కొడవ మరియు కొంకణి భాషలు స్ధానికంగా మాట్లాడే భాషలు. దేశంలోని ఇతర రాష్ట్రాలనుండి ప్రజలు వలసలు రావటంతో ఇక్కడి ఐ.టి. రంగం బాగా విస్తరించింది. రాష్ట్రంలో ఇపుడు మళయాళం, తమిళం, తెలుగు మొదలైన భాషలు మాట్లాడే నివాసితులున్నారు. అయితే, రాష్ట్రంలో ఇంగ్లీష్ కూడా ధారాళంగా మాట్లాడబడుతుంది. కర్నాటక రాష్ట్రంలో టూరిజంకర్నాటక పర్యటన మొత్తంగా రాష్ట్రంలోని 30 జిల్లాలలోను ఎన్నో విశేషతలు కలిగి ఉంది. రాష్ట్రంలో యాత్రికులను అబ్బుర పరచే ఎన్నో రకాల ప్రదేశాలు, వింతలు, విశేషాలు కనపడతాయి. పర్యటించేవారు సాహసికులైనా, అన్వేషకులైనా లేదా ప్రకృతి అందాలకు పరవశించేవారైనా, ఎవరైనప్పటికి వారి వారి అభిరుచులకు తగిన అనేక ఆకర్షణలు  కర్నాటక రాష్ట్రం కలిగి ఉంది.  రాష్ట్రంలోని కూర్గ్ ప్రాంత పచ్చటి లోయలు ఈ ప్రాంతాన్ని ‘స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలువబడేలా చేస్తాయి. కర్నాటక పర్యటనలో ఈ హిల్ స్టేషన్ ఒక ప్రధాన భాగం. చిక్కమగళూరు కర్నాటకకు కాఫీ ప్రదేశంగా పేరు తెచ్చింది.

కనులకు విందు చేసే పచ్చని ప్రదేశాలు, ఒంపు సొంపుల ఎత్తైన జలపాతాలతో కెమ్మనగుండి, కుద్రేముఖ్ ప్రాంతాలు రాష్ట్రంలో పేరొందిన ప్రధాన హిల్ స్టేషన్లుగా పేరు తెచ్చుకున్నాయి. అంతులేని విస్తీర్ణంతో అతి పెద్ద కోస్తాతీరంగా చెప్పబడే మంగుళూరు కర్నాటక పర్యాటకులకు ఒక ప్రధాన బీచ్ ఆకర్షణ. దీని చుట్టుపట్ల కొల్లూరు మూకాంబిక దేవాలయం, ఉడుపి క్రిష్ణ దేవాలయం, హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం, శృంగేరి శారదా దేవి ఆలయం, కుక్కే సుబ్రమణ్య, ధర్మస్ధ, మొదలైన యాత్రా స్ధలాలు మంగుళూరు చుట్టు పట్ల చూడవలసినవి. బైందూర్, మాల్పే, కార్వార్ ప్రదేశాలు చక్కటి బీచ్ లు కాగా మరావంతే ఒక ప్రశాంత కోస్తా తీరానికి ఉదాహరణగా నిలుస్తుంది.  చారిత్రక ప్రాధాన్యతలుగల ప్రదేశాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. వీటన్నిటితో కర్నాటక రాష్ట్రం పర్యటనలకు ఆహ్వానం పలుకుతూ ప్రధానంగా నిలుస్తోంది.

మైసూర్, బాదామి, హంపి, బేళూరు, హళేబీడు, శ్రావణబెళగొళ, మొదలైనవి శిల్పకళా వైభవాలకు అద్దం పడుతూ గడచిన యుగాలపై వేలాది గాధలు వినిపిస్తాయి.  సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి కర్నాటక రాష్ట్రం ఎన్నో అవకాశాలనిస్తుంది. కావేరి ఫిషింగ్ కేంప్, భీమేశ్రి, గాలిబోర్ మరియు దొడ్డమాకలి ప్రదేశాలు సాహసికులకు ఆనందకర అనుభవాన్నిస్తాయి. సావన్ దుర్గ, అంతరగంగే, శివగిరి, రామనగరం మొదలైన పట్టణాలు రాక్ క్లైంబింగ్ మరియు ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఆనందం ఇస్తాయి. హొన్నెమర్దు, శివగంగ, శివనసముద్ర, సంగమ మొదలైన ప్రదేశాలు బోటింగ్, రివర్ ర్యాఫ్టింగ్, నావ ప్రయాణం మరికొన్ని ఇతర నీటి సంబంధిత క్రీడల ఆనందాలు అందిస్తాయి.  కర్నాటకలోని వన్యజీవులు కూడా పర్యాటకులకు ఆకర్షణే. 

ప్రఖ్యాత టైగర్ రిజర్వు అయిన బండిపూర్, ఏనుగులతో నిండిన కాబిని మరియు నాగరహోళే లేదా బి ఆర్ హిల్స్, దండేలి, భద్ర వంటి వన్యజీవుల సంరక్షణాలయాలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచి పర్యాటకులకు మరువలేని అనుభూతులు కలిగిస్తాయి. రాష్ట్రంలో బెంగుళూరు, మైసూర్, మంగుళూరు, మొదలైనవి ప్రధాన నగరాలు. ఇపుడిపుడే మరికొన్ని ప్రదేశాలు పెద్ద నగరాలుగా కూడా ఆవిర్భవించనున్నాయి.  వివిధ సంస్కృతెలతో, ఐ.టి.రంగ కంపెనీలతో, ఆదునిక షాపింగ్ మాల్స్ వంటి వాటితో బెంగుళూరు నిజంగా ఒక మహా నగరమే. కాగా మరికొన్ని ప్రదేశాలు దీని స్ధాయిని అందుకునేందుకు కూడా దానితో పోటీపడుతున్నాయి.పర్యాటకుల విశ్రాంతి సెలవుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేసిన కర్నాటక రాష్ట్ర పర్యటనా ప్రాంతాలు కొన్ని అందిస్తున్నాం పరిశీలించి, పర్యటించి, ఆనందాలను అనుభవించండి.   

కర్నాటక ప్రదేశములు

  • గోకర్ణం 34
  • తలకాడు 40
  • శృంగేరి 48
  • ధర్మస్ధల 29
  • హొరనాడు 11
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed