Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కాశ్మీర్

కాశ్మీర్ - భూతల స్వర్గం !

24

భూతల స్వర్గం గా పరిగణించబడే కాశ్మీర్ తన అద్వితీయమైన అందాలతో అలరారుతూ ఉంటుంది. పిర్పంజల్ పర్వత శ్రేణుల,హిమాయల మధ్య ఉన్నటువంటి ఈ సుందర లోయ , వాయవ్య భారత దేశంలో ఉన్నది. ఇక్కడి ప్రాంతీయ జానపదం ప్రకారం ఈ ప్రదేశం హిందువుల ప్రముఖ ముని అయిన కశ్యపుడు ఒక తటాకాన్నికుచించుకు పోయి లోపలి నేల కనపడే విధంగా చేసినప్పుడు ఈ లోయ ఏర్పడిందని చెప్తారు. ప్రతిఒక్కరు వీక్షించ వలసిన మసీదు హజరత్బల్ మాస్క్, ఇష్రాట్ మహల్ లేదా ప్లెసర్ హౌస్ ఆఫ్ సాజిద్ జహాన్(సాజిద్ జహాన్ షా జహాన్ సైన్యం లో పెద్దఅధికారి) గా కూడా పిలవబడేది. ఈ మాస్క్ దల్ లేక్ తీరం పైన ఉన్నది. హౌస్ ద హెయిర్ ఆఫ్ ప్రొఫెట్ ముహమ్మద్ గా పిలువబడుతుంది ఈ ప్రదేశం. ఈ మాస్క్ ప్రొఫెట్ మొహమ్మద్ పైన ఆయన అనుచరులకు ఉన్న ప్రేమ అభిమానాలకు సాక్ష్యం.

ఇప్పటి ఒక ముఖ్య పర్యాటక ప్రదేశమైన చరార్-ఇ -షరీఫ్ ముఖ్య పురాతన దేవాలయాల లో ఒకటి. శ్రీనగర్ నుండి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ప్రముఖ కాశ్మీరీ సూఫీ సన్యాసి అయిన షేక్ నూర్ ఉద్దిన్ జ్ఞాపకార్ధం నిర్మించబడినది. ఆయన శాకాహారం , అహింస మరియు సామాజిక సామరస్యం అనే వాటిని బోధించారు. జీలం నది తీరాన ఉన్న ఖన్కహ్ ఆఫ్ షా హందన్ మరొక ప్రముఖ పర్యాటక ప్రదేశం. అధ్బుతమైన వేలాడే గంటలు , మలచబడిన ఆకులు వంటి ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి. షా మీర్ వంశీకుడైన రాజు సుల్తాన్ సికందర్ చే 1395 లో ఈ దేవాలయం నిర్మించ బడినది.

1912 లో మహారాజ ప్రతాప్ సింగ్ చే నిర్మించబడిన ఖీర్ భవాని దేవాలయం శ్రీనగర్ కి 27 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. రాజ్ఞ్య అమ్మవారు ఈ దేవాలయం లోని దేవత. హిందువుల దేవుడయిన రాముడు వనవాసం సమయంలో ఈ దేవాలయం లో పూజించాడని నమ్ముతారు. ఖీర్ (భారతీయ తీపి వంటకం) ఇంకా పాలు మాత్రమే నైవేద్యంగా వాడటం వల్ల ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడి స్థానికులు ఈ ఖీర్ (సహజం గా తెలుపు రంగు లో ఉంటుంది) రంగు నల్లగా మారటాన్ని ఒక దుశ్శకునం గా భావిస్తారు.

తఖ్త్-ఎ-సులేమాన్ అనబడే కొండ యొక్క శిఖరం పైన ఉన్నటువంటి శంకరాచార్య దేవాలయం కాశ్మీరు లోని మరొక ప్రఖ్యాత దేవాలయం. సూర్య భగవానుడి దేవాలయం అయిన మార్తాండ్ సన్ దేవాలయం కూడా విశేషంగా భక్తులను ఆకర్షిస్తుంది. సూర్య వంశీకుడైన లలితాదిత్య మహారాజుచే నిర్మించబడిన ఈ దేవాలయం అనంతనాగ్ కి దగ్గరలో ఉంది. గొప్ప నిర్మాణ వైశిష్ట్యంతో ఈ దేవాలయం పేరెన్నికగన్నది.

సహజ గుహ అయిన శివ ఖొరి , తెహసిల్ లేదా రెసి డివిజన్ లో ఉన్నది. ఇక్కడి సహజంగా తయారయిన శివ లింగం వల్ల ప్రదేశం ప్రముఖమైనది. జమ్మూ కి 100 కిలో మీటర్ల దూరంలో ఈ గుహ ఉన్నది. నాగ దేవుడైన శేషనాగు యొక్క గుర్తులు గుహ పైకప్పు పైన చూడవచ్చు. గుహ మధ్య లోని ఖాళీ ప్రదేశం శివుని యొక్క 'జట' అంటే జుట్టు ముడి కి గుర్తుగా కనిపిస్తుంది.

జహంగీర్ చక్రవర్తి చే తన భార్య నూర్ జహాన్ కోసం 1616 నిర్మించబడిన షాలిమార్ గార్డెన్ ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతం. మరొక తోట అయిన ఫైజ్ బక్ష్ , " గార్డెన్ ఆఫ్ లవ్ " గా పిలువబడే ఈ తోట 1628 లో నిర్మించబడినది. టెర్రేస్ గార్డెన్ గా ఈ తోట ని రాజ వంశపు ఆడవారు ఉపయోగించేవారు. నాలుగు అంతస్తుల ఈ గార్డెన్ లో,నాలుగవ టెర్రేస్ అత్యంత అధ్బుతమైనదిగా చెప్తారు. ఈ నాలుగవ అంతస్తు మధ్య లో ఒక నల్ల రాతి మందిరం మరియు ఒక ట్యాంక్ కూడా ఇక్కడ నిర్మించబడినది. ఈ గార్డెన్ లో నిర్వహించబడే లైట్ ఇంకా మ్యూజిక్ షోలు విశేషంగా పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి.

కాశ్మీర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కాశ్మీర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కాశ్మీర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కాశ్మీర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం: జమ్మూ, కార్గిల్ మొదలగు చుట్టుపక్కల ప్రాంతాలనుండి కాశ్మీర్ రోడ్డు మార్గం ద్వారా చక్కగా కలపబడి ఉన్నది. నేషనల్ హై వే 1-ఏ శ్రీనగర్ నుండి జమ్మూని కలుపుతుంది. ప్రైవేటు సూపర్ డిలక్స్ బస్సులు కూడా పర్యాటకులను కాశ్మీర్ చేరుస్తాయి. జె కె స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా మరొక అందుబాటు లోని ప్రయాణ సౌకర్యం. ప్రైవేటు టాక్సీ లు కూడా ప్రయాణికులు ఉపయోగించు కోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం: జమ్మూ తావి రైల్వే స్టేషన్ శ్రీనగర్ కు దగ్గరలోని రైల్వే స్టేషన్. ఇది 305 కిలో మీటర్ ల దూరం లో ఉన్నది. ప్రయాణికులు సులభంగా జమ్మూ నుండి ముఖ్య పట్టణాలైన ఢిల్లీ ,కోల్కతా ,పూణే ,ముంబై మొదలైన చోట్లకి రైలు సౌకర్యం ఎంచుకోవచ్చు. అదనపు రైళ్ళు పర్యాటకులు అధికంగా పర్యటించే కాలం లో అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం: 14 కిలోమీటర్ల దూరం లో ఉన్న శ్రీనగర్ , కాశ్మీర్ కు దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్. ఢిల్లీ, ముంబై, పూణే మొదలగు ముఖ్య పట్టణాల నుంచి పర్యాటకులకు కాశ్మీర్ కు విమాన వసతి కలదు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ,న్యూ ఢిల్లీ ద్వారా ఇతర ముఖ్య దేశాలకు అనుసంధానించబడి ఉన్నది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City