Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కోత్గోడం

కోత్గోడం - 'గేటు వే అఫ్ కుమోన్ హిల్స్' !

6

ఉత్తరఖండ్ లో ని నైనిటాల్ జిల్లాలో గులా నది ఒడ్డున ఉన్న కత్గోడం 'గేటు వే అఫ్ కుమోన్ హిల్స్' గా ప్రసిద్ది చెందింది. సముద్ర మట్టం నుండి 554 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం కుమోన్ హిమాలయాల పాద ప్రాంతం లో ఉంది. ఉత్తరఖండ్ యొక్క రెండవ అతి పెద్ద మునిసిపల్ కౌన్సిల్ అయిన హాల్ద్వాని కోత్గోడం 1942 లో స్థాపించబడినది. కోత్గోడం అంటే కలప గోదాము (టింబర్ డిపో) అని అర్ధం. ఈ ప్రదేశం జిల్లాలో నే వర్తక వాణిజ్యాలకు కేంద్రం గా పరిగణించడం వల్ల ఈ పేరు వచ్చింది. కుమోని, హిందీ మరియు గర్హ్వాలి ఇక్కడి ప్రాంతీయ భాషలు.

అతి తక్కువ జనాభా తో (1901 కి 375) పూర్వం కత్గోడం అనేది ఒక పేరు తెలియని కుగ్రామం. 1909 లో బ్రిటిష్ రైల్వే మ్యాప్ లో ఈ ప్రదేశాన్ని అనుసంధానించినప్పటినించి దీని స్వరూప మేమారిపోయింది. 1884 లో హాల్ద్వాని రైల్వే లైన్ కత్గోడం వరకు విస్తరించబడినది. ఇప్పుడు ఈ స్టేషన్ నార్త్ ఈస్ట్ రైల్వే యొక్క ఆఖరి స్టేషన్ గా సేవలందిస్తున్నది. ఇక్కడి ముఖ్యమైన రెండు ఆకర్షణలలో 'శీత్లా దేవి' మరియు 'కాళీ చౌద్' హిందువుల దేవాలయాలు. పండుగల సమయాన అనేకమంది భక్తులు ఈ దేవాలయాలకు తరలి వస్తారు.

ఇక్కడ గోలా నది, ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఉత్తరాఖండ్ లోని సట్టాల్ లేక్ నుండి ఉద్భవించే ఈ నది హాల్ద్వాని మరియు షాహీ ప్రదేశాల గుండా ప్రవహిస్తుంది. గౌలా బరాజ్ దీనిపై నిర్మించబడిన డ్యాం. ఇది ఒక ప్రఖ్యాత పిక్నిక్ స్పాట్ గా పేరు గడించింది.

పర్యాటకులు కత్గోడం ని పర్యటించేటప్పుడు దగ్గరలో ఉన్న చిన్న నగరం భీమ్టాల్ ని కూడా సందర్శించవచ్చు. ఇది ఇక్కడి నుండి 21 కిలోమీటర్ల దూరం లో ఉంది. భీమ్టాల్ లేక్ యొక్క సజీవ జలాల వల్ల ఇక్కడి ప్రదేశం ఎల్లప్పుడూ పచ్చగా ,రమణీయంగా ఉంటుంది. మహాభారతం లోని భీముని పేరు నుండి ఈ లేక్ కి ఆ పేరు వచ్చింది. భీమేశ్వర్ మహాదేవ అనే పురాతన శివుని మందిరం ఈ చెరువు యొక్క ఒడ్డున ఉన్నది. 17 వ శతాబ్దం లో కింగ్ అఫ్ కుమోన్ బాజ్ బహదూర్ ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ లేక్ మధ్యలో ఉన్న చిన్న ద్వీపం పై నిర్మించబడిన అక్వేరియం మరి యొక ఆకర్షణ.

కత్గోడం నుండి 34 కి.మీ దూరం లో ఉన్న అందమైన లేక్ సిటీ నైనిటాల్ కు రోడ్డు ద్వారా రైల్ ద్వారా చెరుకొవచ్చు.

అలాగే ఇక్కడి నుండి 23 కి మీ దూరం లో ఉన్న సత్తల్ కూడా పర్యాటకులు సందర్శించవచ్చు . సత్తల్ అంటే ఏడూ తటాకాలు అని అర్ధం. అక్కడ ఉన్నఏడు మంచి నీటి తటాకాలు రామ్ తాల్ , నల్ దమయంతి తాల్ , లక్ష్మన్ తాల్ ,ఖుదరియ తాల్ , పూర్ణ తాల్ , సుఖ తాల్ అండ్ సీతా తాల్. వీటితో పాటు, కార్బెట్ వాటర్ ఫాల్ అలాగే హేదఖాన్ ఆశ్రమం ప్రాచుర్యం పొందిన ఇతర ప్రాంతాలు.

కత్గోడం ని సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ ప్రాంతం నుండి 71 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంట్నగర్ విమానాశ్రయంలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ విమానాశ్రయం రెగ్యులర్ ఫ్లైట్స్ ద్వారా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానామై ఉంది. అందువల్ల అంతర్జాతీయ పర్యాటకులు ఇందిరాగాంధీ విమానాశ్రయం నుండి పట్నగర్ కి చేరుకునే సదుపాయం కలదు. నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రాంతంలో ఉన్న కత్గోడం లో ఉన్న రైల్వే స్టేషన్ భారత దేశం లో ప్రధాన పట్టణాలైన లక్నో, ఢిల్లీ మరియు హౌరా వంటి వాటికీ చక్కగా అనుసంధానమై ఉంది. రోడ్డు మార్గాన్ని ఎంచుకునే పర్యాటకులు NH-87 ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఘజియాబాద్, ఢిల్లీ, నైనిటాల్ మరియు హాల్ద్వాని నుండి కత్గోడం కి బస్సు సౌకర్యాలు కలవు.

కోత్గోడం వాతావరణం సంవత్సరం మొత్తం ఆహ్లాదకరం గా ఉంటుంది. ఏప్రిల్ లో మొదలయ్యే వేసవి కాలం జూన్ వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుంది. వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉండటం వల్ల జూలై నుండి నవంబర్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

కోత్గోడం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కోత్గోడం వాతావరణం

కోత్గోడం
28oC / 82oF
 • Sunny
 • Wind: NE 5 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం కోత్గోడం

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? కోత్గోడం

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం : నైనిటాల్, ఘజియాబాద్, హాల్ద్వాని మరియు ఢిల్లీ వంటి ప్రదేశాల నుండి కత్గోడం కి అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం : నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ పరిధిలోకి వచ్చే ప్రధాన రైల్వే స్టేషన్ కత్గోడం టౌన్ లో ఉంది. ఈ రైల్వే స్టేషన్ భారత దేశం లో ని ఢిల్లీ, హౌరా మరియు లక్నో వంటి అన్ని ప్రధాన పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం : కత్గోడం కి సమీపం లో ఉన్న విమానాశ్రయం పంట్నగర్ విమానాశ్రయం. ఇది ఈ నగరం నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం రెగ్యులర్ ఫ్లైట్స్ ద్వారా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానమై ఉంది. టాక్సీలు అలాగే కాబ్ సేవలని ఉపయోగించుకుని పంట్నగర్ విమానాశ్రయం నుండి పర్యాటకులు కత్గోడం కి చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Sun
Return On
30 Mar,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
29 Mar,Sun
Check Out
30 Mar,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Sun
Return On
30 Mar,Mon
 • Today
  Kathgodam
  28 OC
  82 OF
  UV Index: 8
  Sunny
 • Tomorrow
  Kathgodam
  21 OC
  69 OF
  UV Index: 8
  Sunny
 • Day After
  Kathgodam
  21 OC
  71 OF
  UV Index: 8
  Sunny