Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కేదార్నాథ్

కేదార్నాథ్ - హిందువుల పవిత్ర ప్రదేశం !

35

కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది.ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో గర్హ్వాల్ హిమాలయాలలో ఉంది. హిందూమతం వారు పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. కేదార్నాథ్ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైనది. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ పుణ్య క్షేత్రమును శివ ఆశీర్వాదం పొందడం కోసం వేసవిలో ఎక్కువగా పర్యాటకులు వస్తారు.

1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం దీర్ఘ చతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. భక్తులు ఈ పుణ్యక్షేత్రం నకు వెళ్ళే మెట్లపై పాలి భాషలో రాసిన శాసనాలు చూడవచ్చు. సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ను చేరుకోవటం అన్ని చార్‌ ధామ్‌ పుణ్యక్షేత్రాల కన్నా కష్టతరమైనది. ఈ ఆలయం కేవలం వేసవిలో 6 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాంతం నివాసానికి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. శీతాకాలంలో భారీ మంచు వర్షం ఉండుట వల్ల ఈ పుణ్యక్షేత్రంను మూసివేస్తారు.

కేదార్నాథ్ ప్రయాణించే ప్రయాణీకులు కేదార్నాథ్ దేవాలయం సమీపంలో ఉన్న ఆది శంకరాచార్య గురు యొక్క సమాధిని తప్పక సందర్శించాలి.శంకరాచార్య ప్రముఖ హిందూ మత మహర్షి అద్వైత వేదాంత యొక్క అవగాహన వ్యాప్తి కొరకు కృషి చేసారు. అయన చార్ ధామ్‌ కనుగొన్నతరువాత ఈ నిర్దిష్ట ప్రదేశంలో 32 ఏళ్ల వయస్సులో సమాధి అయ్యారు.

కేదార్నాథ్ నుండి 19 కి.మీ.దూరంలో ఉన్న సొంప్రయగ్ సముద్ర మట్టానికి 1829 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఇది ప్రధానంగా బాసుకి నది మరియు మందాకిని నది యొక్క సంగమం ఉంది. పురాణములు ప్రకారం,ఈ ప్రదేశంలో అద్భుత శక్తులు కలిగి ఉన్నట్లు నమ్మకం. అందువల్ల ఈ నీరు తాకటానికి వచ్చే వ్యక్తులు ఆ చోటు కనుగొనడానికి బైకుంత్ ధామ్ వస్తారు. వాసుకి తాల్ కేదార్నాథ్ నుండి 8 కిమీ దూరంలో సముద్ర మట్టానికి 4135 మీటర్ల ఎత్తులో ఉన్న మరొక ప్రముఖ ప్రదేశం. సరస్సు చుట్టూ హిమాలయ శ్రేణులు అత్యద్భుతమైన అందాన్ని ఇస్తాయి. అద్భుతమైన చౌఖమ్బ పీక్స్ కూడా ఈ సరస్సు దగ్గరగా ఉన్నాయి. వాసుకి తాల్ సందర్శించడం కొరకు, చతురంగి మరియు వాసుకి హిమనీనదాలు దాటాలి,మరియు అక్కడ ఆదేశాలను అపారమైన సహన శక్తి తో పాటించాలి.

1972 వ సంవత్సరం లో స్థాపించబడిన కేదార్నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం అలకానంద నది యొక్క బేసిన్లో ఉన్నది.ఈ అభయారణ్యం 967 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దట్టంగా పైన్, ఓక్, బిర్చ్, బుగ్యల్స్ మరియు ఆల్పైన్ వృక్ష సంపదతో నిండి ఉంది. వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క వివిధ రకాలు ఉండుట వలన ఈ స్థలం విభిన్న భౌతిక మరియు భౌగోళిక లక్షణాలను ఈ ప్రాంతంలో గుర్తించవచ్చు. భారల్స్ , పిల్లులు, గోరల్స్,నక్కలు, నల్ల ఎలుగుబంట్లు, మంచు చిరుతలు, సంభార్స్ మరియు సేరోవ్స్ వంటి జంతువులను తరచుగా చూడవచ్చు. ఈ అభయారణ్యం అంతరించిపోతున్న కేదార్నాథ్ కస్తూరి జింక యొక్క జాతులను రక్షిస్తుంది. పక్షులను తిలకించాలనుకునేవారికి ఫ్లైకాచర్లు, మొనల్స్ మరియు బూడిద బుగ్గల గల పాడేడు పక్షిలు వంటి పక్షులు వివిధ రకాలను గుర్తించవచ్చు. అంతేకాకుండా, సందర్శకులు మందాకిని నదిలో షైజోథోరాక్స్ స్పీషీస్, నేమచేలుస్, గారా స్పీషీస్,బరిలుస్ స్పీషీస్ మరియు మహ్సీర్ టోర్ కర్త వంటి రక రకాల చేపలను చూడవచ్చు.

కేదార్నాథ్ ను సందర్శించినప్పుడు సమయం అనుమతిస్తే గుప్తకాశిని తప్పకుండ సందర్శించండి. ప్రాంతంలో పురాతన విశ్వనాథ్ ఆలయం, మణికర్ణిక కుండ్ మరియు అర్ధ్నరేస్వర్ ఆలయం అనే 3 దేవాలయాలు ఉన్నాయి. అర్ధ్నరేస్వర్ ఆలయంలో సగం శివ మరియు సగం స్త్రీ రూపంలో ఉన్న దేవుని విగ్రహం ను చూడవచ్చు. విశ్వనాథ్ ఆలయం కూడా తన అవతారములలో ఒకటిగా ఉంది. కేదార్నాథ్ లో మరొక ప్రముఖ ఆలయం 0.5 km దూరంలో భైరవుని నాథ్ దేవాలయం ఉంది. ఈ ఆలయం శివ యొక్క గణ అయిన లార్డ్ భైరవునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో దేవుడు విగ్రహం మొదటి రావల్ ద్వారా స్థాపించబడింది.

సముద్ర మట్టానికి 1982 మీటర్ల ఎత్తులో ఉన్న గౌరికున్ద్ కేదార్నాథ్ లో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. ఒక పురాతన ఆలయం హిందూ మత దేవతైన పార్వతికి అంకితం చేయబడింది. పురాణములు ప్రకారం, పార్వతీదేవి ఆమె భర్త లార్డ్ శివ కోసం ఇక్కడ ధ్యానం చేసెను. గౌరికున్ద్ లో ఉన్న వేడి నీటి బుగ్గ ఔషధ విలువలు కలిగి ఉండుట మరియు వ్యక్తుల యొక్క పాపములు పోగాట్టడానికి సహాయపడుతుంది.

కేదార్నాథ్ సమీపంలోని విమానాశ్రయం కేవలం 239 కిమీ దూరంలో ఉన్న డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం. రైలు ప్రయాణం అనుకున్నవారికి 227 km దూరంలోఉన్న రుషికేష్ రైల్వే స్టేషన్ వరకు తమ టిక్కెట్లను బుక్ చేయవచ్చు.

మే మరియు అక్టోబర్ నెలల మధ్య కాలంలో ఉష్ణోగ్రత ఈ సమయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు కేదార్నాథ్ ను సందర్శించడం అనుకూలమైనది . ఈ ప్రాంత స్థానికులు భారీ మంచు కారణంగా శీతాకాలంలో కేదార్నాథ్ ను ఖాళీ చేస్తారు.

కేదార్నాథ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కేదార్నాథ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కేదార్నాథ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కేదార్నాథ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం బస్సులు గౌరికున్ద్ కు హరిద్వార్, రుషికేష్, మరియు కోట్ద్వార నుండి అందుబాటులో ఉన్నాయి. యాత్ర సీజన్ సమయంలో, ప్రత్యేక యాత్ర సేవలు గౌరికున్ద్ నుండి పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. యాత్రికులు తరచుగా రుషికేష్ మరియు గౌరికున్ద్-బదరీనాథ్ మధ్య ప్రైవేటు టాక్సీలు మరియు క్యాబ్లు లభిస్తాయి. యాత్రికులకు కేదార్నాథ్ నుండి వారి సామానులు పైకి తీసుకువెళ్ళటానికి గౌరికున్ద్ నుండి గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కేదార్నాథ్ నుండి 221 km దూరంలో ఉన్న సమీప రుషికేష్ రైల్వే స్టేషన్. యాత్రికుల రైల్వే స్టేషన్ నుండి కేదార్నాథ్ కు ప్రీపైడ్ టాక్సీలు లభిస్తుంది. ప్రయాణికులు కేదార్నాథ్ చేరుకోవడానికి 207 కిలోమీటర్ల దూరం ప్రారంభ టాక్సీలు ద్వారా సులభంగా చేరి అక్కడ నుండి మిగిలిన 14 km కాలినడకన చేరాలి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కేదార్నాథ్ సమీపంలోని విమానాశ్రయం 239 km దూరంలోఉన్న డెహ్రాడూన్ జాలీగ్రాంట్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నేరుగా భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు మరియు ఢిల్లీ విమానాశ్రయం నకు లింక్ చేయబడింది. ప్రపంచ పర్యాటకులు న్యూఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి డెహ్రాడూన్ విమానాశ్రయానికి విమానాల అనుసంధానం లభిస్తుంది. టాక్సీ క్యాబ్ మరియు సేవలు డెహ్రాడూన్ విమానాశ్రయం నుండి కేదార్నాథ్ సులభంగా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat