Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కెమ్మనగుండి

కెమ్మనగుండి - మహరాజుల విశ్రాంతి ప్రదేశం

12

కెమ్మనగుండి కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా తరికెరి తాలూకాలో కలదు. కెమ్మనగుండి ఒక హిల్ స్టేషన్ దీని చుట్టూ బాబా బూదాన్ గిరి కొండలు కలవు. ఎత్తైన కొండలు, జలపాత ధారాలు, దట్టమైన అడవులు, పచ్చటి మైదానాలు ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రదేశంగా మార్చాయి.  

ఈ ప్రాంతాన్ని నాల్గవ క్రిష్ణరాజ ఒడయార్ బాగా ఇష్టపడేవాడు కనుక దానిని బాగా అభివృధ్ధి చేశాడు. కనుక ఆ మహారాజు పేరుతో కెమ్మనగుండిని కె.ఆర్. హిల్స్ అని కూడా అంటారు. ఆయన ఈ ప్రాంతంలో రోడ్లు, అందమైన తోటలు నిర్మింపజేసి ఈ కొండను ఒక వినోద లేదా విహార స్ధలంగా లనకు అనువుగా చేసుకున్నాడు. అక్కడి సహజ అందాలను మరింత కాపాడి ఆనందించేవాడు. తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతాన్ని కర్నాటక ప్రభుత్వానికి అప్పగించాడు. అప్పటి నుండి ఈ రిసార్టును కర్నాటక ప్రభుత్వ హార్టికల్చరల్ డిపార్ట్ మెంట్ నిర్వహిస్తోంది.   

కెమ్మనగుండి ప్రదేశంలో ఏం చూడాలి? ఏం చేయాలి?

కెమ్మనగుండి లో అనేక పర్యాటక ప్రదేశాలు  కలవు. అన్నింటిని ఒకే రోజు పర్యటించటం సాధ్యం కాదు. జీ పాయింట్ అనేది ఎత్తైన కొండపై గల ఒక ప్రదేశం. 30 నిమిషాలలో కొండపైకి చేరవచ్చు. పైనుండి పర్యాటకులు ఈ ప్రాంతంలోని సహజ ప్రకృతి దృశ్యాలను, అందమైన శాంతి జలపాతాలను చూచి ఆనందించవచ్చు.

రెండు దశలలో ప్రవహించే హెబ్బే జలపాతాలు ఇక్కడే కలవు. కలాట్టి జలపాతాలు కూడా ఇక్కడే కలవు వీటిని కాళహస్తి జలపాతాలు లేదా కాళతగిరి జలపాతాలు అంటారు. ఇవి 120 మీటర్ల ఎత్తునుండి కింద పడతాయి. ఈ ప్రదేశంలో విజయనగర కాలంనాటి దేవాలయం ఒకటి కలదు. ముళ్ళయనగిరి మరియు భద్ర టైగర్ రిజర్వ్ లు కూడా కెమ్మనగుండి సందర్శనలో తప్పక చూడాలి.

సాహస క్రీడాకారులు ఈ ప్రాంతాన్ని బాగా ఇష్టపడతారు. కర్నాటకలో సమీప నగరాలలో ఉండే వారికి ఇది చక్కని వారాంతపు సెలవుల విహారానికి పనికి వస్తుంది. 

కెమ్మనగుండి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కెమ్మనగుండి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కెమ్మనగుండి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కెమ్మనగుండి

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం కెమ్మనగుండికి బెంగుళూరు(295 కి.మీ) నుండి మరియు మంగుళూరు (190 కి.మీ.), మరియు చిక్కమగళూరు (55 కి.మీ.) లనుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - కెమ్మనగుండికి రైలు స్టేషన్ లేదు. తరికెరె రైలు స్టేషన్ 15 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ రైలు స్టేషన్ దేశంలోని పట్టణాలకు, నగరాలకు అనుసంధానించబడింది. ఇక్కడనుండి కెమ్మనగుండికి టాక్సీలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కెమ్మనగుండి చేరటం ఎలా? విమాన ప్రయాణం కెమ్మనగుండి చేరాలంటే, మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 190 కి.మీ.ల దూరంగా ఉంటుంది. ఇక్కడినుండి దేశంలోని వివిధ నగరాలకు, విదేశాలకు కూడా ప్రయాణించవచ్చు. మంగుళూరు నుండి కెమ్మనగుండికి టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కెమ్మనగుండికి 295 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat