Search
 • Follow NativePlanet
Share

ఖమ్మం : కోట నగరం

17

దక్షిణ భారత దేశంలోని తెలంగాణ  రాష్ట్రంలో వున్న ఖమ్మం నగరం ఖమ్మం జిల్లాకు ప్రధాన కేంద్రం కూడా. ఇటీవలే చుట్టుపక్కల వున్న 14 గ్రామాలను విలీనం చేయడంతో నగరపాలక సంస్థగా ఈ నగరం రూపాంతరం చెందింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు తూర్పున 273 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ నగరం తెలంగాణ సందర్శించే వారికి నచ్చే పర్యాటక స్థలం.

స్థానిక గాధల ప్రకారం స్థంభ శిఖరి లేదా స్తంభాద్రి అని పిలువబడిన నరసిమ్హాద్రి గుడి పేరిట ఈ ఊరి పేరు ఏర్పడింది. విష్ణు మూర్తి అవతారం నరసింహ స్వామి దేవాలయం ఇది. సుమారు 1.6 మిలియన్ ఏళ్ళనాటి త్రేతా యుగం నుంచి ఈ నగరం ఉండేదని రుజువైంది. ఈ గుడి ఒక కొండ శిఖరం పై ఉ౦డగా కొండ క్రింద నిలువుగా వున్న రాయి స్థంభం లాగా పని చేసేది. ఈ స్థంభం లేదా ‘ఖంబా’ అనే పదం నుంచి ఈ ఊరి పేరు పుట్టింది. ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాన్ని ‘కంబం మెట్టు’ అనేవారు, అదే క్రమేణా ఖమ్మం మెట్టు లేదా ఖమ్మం గా మారిపోయింది.

కృష్ణా నదికి ఉపనది అయిన మునేరు ఒడ్డున అందమైన ఖమ్మం నగర౦ వుంది.  చరిత్రలో ఖమ్మం ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఇక్కడి సుప్రసిద్ధ ఖమ్మం కోట కేవలం ఈ జిల్లాకే గాక, రాష్ట్రం మొత్తానికి చాలా ముఖ్యమైనది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు వివిధ నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించిన౦దు వల్ల ఈ మిశ్రమ శైలి ఏర్పడింది.

ప్రాచీన కాలం నుంచి, ముఖ్యంగా తాలూకాల హయాం నుంచీ ఖమ్మం వాణిజ్య, సామాజిక కార్యకలాపాల కేంద్రంగా వుండేది. ఖమ్మం ను పరిపాలించిన ఎంతో మంది రాజవంశీకులు ఈ నగర చరిత్ర, కళ, నిర్మాణ శైలుల మీద చెరగని ముద్ర వేశారు. ఖమ్మం మత సామరస్యానికి కూడా చక్కటి ఉదాహరణ. వివిధ మతాలకు చెందిన వారు తమ తమ మతాలను అవలంబిస్తూ వుండడం ఖమ్మం కు ప్రత్యేకత తీసుకు వచ్చింది. ఖమ్మం లోని ప్రధాన ఆకర్షణలు గుళ్ళూ, మసీదులే, అందులోనూ పక్క పక్కనే ఉండేవి ఎక్కువ.

ఖమ్మం లో పర్యటన

ఖమ్మం, భారతదేశం లోని లక్షలాదిమంది పర్యాటకులు ఆకర్షించే ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఖమ్మంలోను, చుట్టుపక్కల ఆస్వాదించదగ్గ అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం కోట, జమలాపురం ఆలయం, ఖమ్మం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణలు. ఈ ప్రాంతంలో పలైర్ సరస్సుతో పాటు పాపి కొండలు, వాయర్ సరస్సు ప్రధాన సందర్శనీయ స్థలాలు.

ఆహ్లాదకర వాతావరణం ఉండే శీతాకాలంలో ఖమ్మం సందర్శించడం ఉత్తమం. ఈ ప్రాంతం ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, ఉత్తర ప్రాంత౦తో పోలిస్తే తక్కువ చలిని కలిగి ఉంటుంది. అయితే, వేసవిలో అధిక వేడి వల్ల ఆ సమయంలో ఖమ్మం సందర్శించడం సరైనది కాదు. ఈ ప్రాంతంలో ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి, ఈ సమయంలో ఉష్ణోగ్రత పడిపోతుంది, కానీ మంచు స్థాయి పెరుగుతుంది.

ఖమ్మం నగరం రాష్ట్రంలోని అదేవిధంగా దేశంలోని ఇతర భాగాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఖమ్మంలో ఎటువంటి విమానాశ్రయం లేదు, రాజధాని నగరమైన హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప విమానాశ్రయం. అయితే, ఖమ్మం లో విమానాశ్రయం లేకపోవడం వల్ల రోడ్డు, రైలు మార్గాలు ఏర్పడ్డాయి. ఈ నగరం గుండా రెండు జాతీయ రహదారులు ఉండడం వల్ల రోడ్డు ప్రయాణం సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం, ఇతర నగరాల మధ్య అనేక బస్సులు నడుపుతుంది. ఇది హైదరాబాద్-విశాఖపట్టణం లైన్ లో ఉండడం వల్ల భారతదేశం అంతటి నుండి అనేక రైళ్ళు ఖమ్మం కి చేరుకుంటాయి.

 

ఖమ్మం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఖమ్మం వాతావరణం

ఖమ్మం
35oC / 96oF
 • Sunny
 • Wind: NE 8 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఖమ్మం

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? ఖమ్మం

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ద్వారా రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం నగరానికి తేలికగా చేరుకోవచ్చు. ఖమ్మం నుండి ప్రభుత్వ మరియు అనేక ప్రైవేట్ బస్సులు అటు-ఇటు ప్రతిరోజూ నడపబడతాయి. అనేక డీలక్స్, అలాగే వాల్వో బస్సులు కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుండి ఖమ్మం కి బైల్దేరతాయి. ఖమ్మం నగరం గుండా జాతీయ రహదారులు 5 మరియు 7 రెండు జాతీయ రహదారులు ఉంటాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ద్వారా ఖమ్మం నగరం దక్షిణ రైల్వే వారి మంచి నెట్వర్క్ ద్వారా భారతదేశం లోని ఇతర నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. ఈ పట్టణం హైదరాబాద్-విజయవాడ లైన్ లో వస్తుంది. ఈ లైన్ ద్వారా వరంగల్, విశాఖపట్టణం, తిరుపతి, చెన్నై, న్యూ డిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి ఇతర పట్టణాలకు ఈ నగరం అనుసంధానించబడి ఉంది. ఇక్కడ అనేక సూపర్ ఫాస్ట్, పాసెంజర్, ఎక్స్ప్రెస్ రైళ్ళు ఖమ్మలో ఆగుతాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం ద్వారా: ఖమ్మంలో విమానాశ్రయం లేదు. గన్నవరం ఖమ్మం కి దగ్గర విమానాశ్రయ౦, ఇది ఒక దేశీయ విమానాశ్రయం. ఖమ్మం నగరం నుండి 298 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయ౦. ఖమ్మంలో విమానాశ్రయ నిర్మాణ౦ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. విమానం ద్వారా హైదరాబాద్ వచ్చిన వారు అద్దె టాక్సీలలో లేదా బస్సులలో ఖమ్మం చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి

ఖమ్మం ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Feb,Wed
Return On
20 Feb,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Feb,Wed
Check Out
20 Feb,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Feb,Wed
Return On
20 Feb,Thu
 • Today
  Khammam
  35 OC
  96 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Khammam
  32 OC
  89 OF
  UV Index: 9
  Partly cloudy
 • Day After
  Khammam
  33 OC
  91 OF
  UV Index: 10
  Partly cloudy