ఖండాలా లోని కునే ఫాల్స్ ఒక ప్రధాన ఆకర్షణ. 100 కిలోమీటర్ల ఎత్తు నుండి పడే గంభీరమైన కునే జలపాతం చూడడం ఏ ఒక్కరు మర్చిపోకూడదు. లోనవల ఖండాలా మధ్యలో గల ఈ జలపాతంలో పర్యాటకులను జలకాలాటలకు అనుమతిస్తారు.
ప్రకృతిసౌందర్య ప్రేమికులు తప్పనిసరిగా చూడవలసిన ప్రాంతం భుషి సరస్సు. ఖండాలాలోని ఈ సరస్సు ఒడ్డున బద్ధకంగా అనిపించే మధ్యాహ్నాల బడలిక తగ్గించుకోవచ్చు. దీని నిర్మలమైన ప్రశాంత పరిసరాలు, స్వచ్చమైన నీరు పర్యాటకుల విశ్రాంతికి అనువైన అనేక అవకాశాలను కల్గిస్తాయి ఖండాలా...
ఈ పర్వతకేంద్రం నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరం లో కర్ల – భజ గుహలు ఖండాలాలో గల అనేక యాత్ర విశేషాల్లో ఒకటి. ఇక్కడి అపారమైన పురాతనసౌందర్యం క్రీ.పూ. 2 శతాబ్దం నాటిది. ఇవి బౌద్ధ హీనయాన శాఖ కు చెందిన పురాతన బౌద్ధరాతి గుహాలయాలకు...
రివర్సింగ్ స్టేషన్ ఖండాలా లోని ఒక అద్భుతమైన ప్రాంతం. 26వ నెంబర్ టన్నెల్ వద్దగల ఈ పురాతన ప్రాంతం రైల్వేకు చెందినా ప్రస్తుతం ఉపయోగంలో లేదు. రాత్రి పూట ఈ ప్రాంతం అనేక వందల లైట్లు వెలగడం వల్ల ప్రకాశవంతంగా దివ్యంగా కనబడుతుంది
ఖండలఘాట్ ప్రారంభoలో మొదటి వాలులోని అంచున గల అమృతాంజన్ పాయింట్ మరొక చూదగిన ప్రదేశం. ఇక్కడ నుండి దగ్గరలోని ఉత్కంఠభరిత దృశ్యాలను చూడవచ్చు. ఈ పాయింట్ నుండి లోయలోని అందమైన దృశ్యాలు, డ్యూక్స్ నోస్ దృశ్యాలను చూడవచ్చు. ఈ పాయింట్ నుండి ఖోపూలి నగరాన్ని కూడ చూడవచ్చు.
ఖండాలాలోని శివాజి పార్కు అందరూ చేరే మరో ప్రదేశం. మొదట్లో ఆటస్థలమైన ఈ ప్రాంతాన్ని 1956 లో ఒక అందమైన ఉద్యానవనం గా మార్చారు. ఇందులో గొప్ప మరాఠా పాలకుడైన శ్రీ శివాజి మహారాజు స్మారక విగ్రహం ఉంది.
పెద్ద పెద్ద, పొడవైన చెట్లతో నిండిన పెద్ద అందమైన తోట రై ఉడ్. లోనవాల, ఖండాలాకు మధ్యలో గల ఈ ప్రాంతం పేరులో కొంత చమత్కార శబ్దలక్షణం ఉంది. ఒక ఇంగ్లీష్ అధికారి మిస్టర్ రై పేరున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని కొంతమంది వాదిస్తే, మరికొంతమంది మరాఠీలోని దట్టమైన అడువులు...
ఖండాలా లోని మైమరిపించే ప్రాంతం ది టైగర్స్ లీప్. ఖండాలా లోని అనేక ఆకర్షణీయ ప్రాంతాలలో ఒకటైన ఈ లోయను జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక పులి లోయ మీదకు దూకుతున్నట్లుగా అనిపించడమే ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి గల కారణం. పర్యాటకులకు ఈ లోయ లోని ప్రదేశాలను సురక్షిత మైన...
ఖండాలా లోని మంకి హిల్ స్థానిక పర్యాటకులకు అభిమాన యాత్ర స్థలము. ఖపోలి పట్టణానికి పైన రైల్వే ట్రాక్స్ కు ఉత్తరాన గల పెద్ద చదునైన ఈ ప్రాంతానికి ఖోపోలి నుండి లేదా బోర్ఘాట్ రివర్సింగ్ స్టేషన్ నుండి గాని చేరవచ్చు.
రాళ్ళను ఎక్కే సాహాసాన్ని చేయదలుచుకుంటే మీరు ఖండాలా లో ఈ ప్రయత్నాన్ని చేయవచ్చు. డ్యూక్స్ నోస్ పీక్, కర్ల కొండలు ఎక్కి డ్యూక్ నోస్ పై నుండి విశాలమైన గ్రామ ప్రాంతాలకు చెందిన మైమరపించే అందాలను చూడవచ్చు.