సందర్శనకు అనుకూల సమయంఖొడాల ప్రదేశాన్ని వేసవి తప్ప సంవత్సరంలో ఎపుడైనా సందర్శించవచ్చు. వర్షాకాలం తర్వాత మరియు శీతాకాల సమయంలో ఖొడాల పర్యటన మీకు పూర్తి ఆనందం కలిగిస్తుంది.
వేసవి ఖొడాల పట్టణంలో వేసవి మూడు నెలలు అంటే మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలలో కొనసాగుతుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 32 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి.
వర్షాకాలం వేసవి వెనుకబడినంతనే వచ్చే చల్లటి వర్షాకాలపు జల్లులు ఎంతో ఊరటనిస్తాయి. ఖొడాల ప్రాంతం ఒక మోస్తరుగా అపుడపుడూ వర్షాలు పొందుతుంది. వర్షాలంటే ఇష్టపడేవారికి ఈ సమయంలో ప్రాంత సందర్శన ఎంతో నచ్చుతుంది.
శీతాకాలం ఖొడాల లో శీతాకాలం డిసెంబర్ నెల నుండి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో శీతాకాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉండి పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగించి ప్రాంతాన్ని పూర్తిగా పర్యటించేలా చేస్తాయి.