Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొడైకెనాల్

కొడైకెనాల్ – అడవి అంచున అందాలు!

36

కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఒక పీఠభూమి పైన ఉన్న ఈ పట్టణం తమిళనాడు లోని ది౦డుగల్ జిల్లలో ఉంది.

కొడైకెనాల్ పట్టణం పర-ప్పర్, గుండర్ లోయల మధ్యలో ఉంది. కొడైకెనాల్ కి ఉత్తరాన విల్పట్టి గ్రామం, పల్లంగి గ్రామం క్రింద వాలుగా ఒక కొండ ఉంది. తూర్పున, కొండల వాలు క్రింద పళని హిల్స్ ఉన్నాయి. కొడైకెనాల్ దక్షిణాన కంబం వ్యాలీ ఉంది, పడమరన మంజంపట్టి లోయ, అన్నామలై పర్వతాలకు దారితీసే ఒక పీటభూమి ఉంది.

తమిళంలో కొడైకెనాల్ అంటే అర్ధం అడవుల బహుమతి. అయితే, కోడై పదానికి నాలుగు వేరువేరు అర్ధాలు ఉన్నాయి కాబట్టి ఈ పేరుకు సంబంధించి నాలుగు సంస్కరణలు ఉన్నాయి. మొదటిది “అడవి చివరలో”, రెండవది “లతల అడవి”, మూడవది “వేసవి కి అడవి”, నాలుగవ దాన్ని “అడవి బహుమతి” గా అనువదించారు.

కొడైకెనాల్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఈరోజు కొడైకెనాల్ అత్యంత ప్రసిద్ధ సెలవల గమ్యస్థానాలలో ఒకటి. ఇది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి.

కోకర్స్ వాక్, బేర్ షోల జలపాతాలు, బ్ర్యాంట్ పార్కు, కొడైకెనాల్ సరస్సు, గ్రీన్ వ్యాలీ వ్యూ, సహజ చరిత్ర కలిగిన శేమ్బగానుర్ మ్యూజియం, కొడైకెనాల్ సైన్స్ అబ్జర్వేటరీ, పిల్లర్ రాక్స్, గుణ కేవ్స్, సిల్వర్ కాస్కేడ్, డాల్ఫిన్స్ నోస్, కురింజి అండవార్ మురుగన్ ఆలయం, బెరిజం లేక్ వంటివి కొడైకెనాల్ లోను, చుట్టుపక్కల ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ సందర్శించ దగిన అనేక చర్చిలు కూడా ఉన్నాయి.

కొడైకెనాల్ రేగు, బేరి వంటి పండ్లకు కూడా ప్రసిద్ధిచెందింది. ఈ స్థలం ఇంట్లోతయారుచేసే చాక్లెట్ అమ్మే అనేక దుకాణాలతో చాక్లెట్ ప్రేమికులకు స్వర్గంగా ఉంటుంది. కొడైకెనాల్ యూకలిప్టస్ నూనేని కూడా తయారుచేస్తుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్పించే కురింజి పూలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతం పర్వతారోహణ, బోటింగ్, గుర్రపు స్వారీ, సైక్లింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలను కూడా అందిస్తుంది.

చరిత్ర ద్వారా సంగ్రహావలోకనం

పర్వత ప్రాంత మొదటి నివాసులు పలైయర్ తెగకు చెందిన ప్రజలు. ఈ స్థలాన్ని క్రీస్తు శకం సంగం సాహిత్యంలో కనుగొన్నారు. 1821 లో బ్రిటీష్ వారు లెఫ్టినెంట్ బీఎస్.వార్డ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ప్రవేశించారు. వారు 1845 లో ఈ పట్టణాన్ని నిర్మించి, అభివృద్ది చేసారు. తరువాత 20 వ శతాబ్దంలో అనేకమంది భారతీయ ప్రముఖులు ఈ ప్రాంతాన్ని మార్చి, ఇక్కడ స్థిరపడ్డారు.

కొడైకెనాల్ చేరుకోవడం ఎలా

హిల్ స్టేషన్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదురై కొడైకెనాల్ కి సమీప విమానాశ్రయం. మదురై, కోయంబత్తూర్, చెన్నై విమనాశ్రయాలకి అనుసంధానించబడి ఉంది. ఈ రెండు విమానాశ్రయాలు కొడైకెనాల్ కు ప్రపంచంలోని, దేశంలోని చుట్టుపక్కల నగరాలను కలుపుతుంది. ఇక్కడికి ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ;ఉన్న కోడై రోడ్డు కొడైకెనాల్ కి సమీప రైల్వే స్టేషన్. బెంగళూర్, ముంబై, ఎర్నాకులం, త్రివేండ్రం వంటి నగరాలను కలిపే కోయంబత్తూర్ జంక్షన్ సమీప ప్రధాన రైల్వే స్తేషన్. కొడైకెనాల్ ను కేరళ, తమిళనాడు అంతటి నుండి బస్సుల ద్వారా కూడా చేరుకోవచ్చు. బెంగళూర్ నుండి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి.

కొడైకెనాల్ వాతావరణం

కొడైకెనాల్ లో ఏడాది పొడవునా మంచి వాతావరణం ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య సమయంలో కొడైకెనాల్ సందర్శించడం ఉత్తమం. జూన్ ఆగస్ట్ మధ్య ఈ ప్రాంతం పచ్చగా, అందంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కూడా కొడైకెనాల్ సందర్శించవచ్చు. శీతాకాల సమయంలో కూడా ఈ ప్రాంతం సందర్శనకు బాగుంటుంది.

కొడైకెనాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొడైకెనాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొడైకెనాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొడైకెనాల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా ఇక్కడినుండి మదురై, కోయంబత్తూర్, బెంగళూర్, ట్రిచి, చెన్నై కి రోజువారీ బస్సు సర్వీసులు నడుస్తాయి. ఈ పట్టణ ప్రయాణానికి బస్సు సరసమైన, సౌకర్యవంతమైన ఎంపిక.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా కొడైకెనాల్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడై రోడ్డు సమీప రైలు కేంద్రం. అయితే, కోయంబత్తూర్ సమీప ప్రధాన జంక్షన్, ఈ పట్టణం డిల్లీ, కొలకత్తా, చెన్నై, బెంగళూర్, ఇతర పట్టణాలు, దేశంలోని ఇతర నగరాలకు అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా పర్వత ప్రాంతం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదురై, కొడైకెనాల్ కి సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయ౦ కోయంబత్తూర్, చెన్నై కి కలుపబడి ఉంది. ప్రపంచంలోని, దేశంలోని ప్రాంతాలను సమీప చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతానికి కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed