Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్హాపూర్ » వాతావరణం

కొల్హాపూర్ వాతావరణం

సందర్శించడానికి సరైన సమయంకొల్హాపూర్ లోని వాతావరణం తీర, అన్తఃస్థలీయ వాతావరణ మనోహరమైన మిశ్రమం. ఉష్ణోగ్రత సాధారణంగా 14 డిగ్రీల నుండి   35 డిగ్రీల వరకు ఉంటుంది. మే నెలలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నపుడు మినహాయించి, ఏడాది పొడవునా కొల్హాపూర్ ని సందర్శించవచ్చు. 

వేసవి

వేసవివేసవి కాలంలో గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత లేకపోతె, సాధారణంగా 33 C – 35C  నించి 24 C – 26 C మధ్య మారుతూ ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఎక్కువ తేమతో ఉండి, బాగా చల్లగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంజూన్ నుండి సెప్టెంబర్ మధ్య సమయం వర్షాకాలాన్ని సూచిస్తుంది, ఈ సమయంలో కొల్హాపూర్ పడమటి కనుమలు దగ్గరగా ఉండటంవల్ల గణనీయమైన వర్షపాతాన్ని పొందుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత 20 డిగ్రీ ల  నుండి 30 డిగ్రీ లతో ఉండి, వర్షాకాలం మధ్యస్థ వర్షపాతాన్ని అందిస్తుంది. అయితే, ఆ సమయంలో వర్షాలు ఎక్కువగా ఉన్నపుడు, కొన్ని నెలల పాటు తీవ్రమైన వరదలు సంభవిస్తాయి.

చలికాలం

శీతాకాలంనవంబర్ నించి ఫిబ్రవరి వరకు విస్తరించి ఉంది, కొల్హాపూర్ లో శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో ఉష్ణోగ్రత సాధారణంగా 14 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. తేమ తక్కువగా వుండడం వలన ఈ కాలం ఆహ్లాదంగా వుంటుంది.