Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోణార్క్ » వాతావరణం

కోణార్క్ వాతావరణం

కోణార్క్ వాతావరణం అక్టోబర్ నుండి మార్చ్ వరకు కోణార్క్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

వేసవి

ఎండాకాలం ఉష్ణ మండలీయ వాతావరణం కలిగి ఉంటుంది. ఎండాకాలం నెలలు వేడిగా, తేమగా ఉంటాయి. 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ సమయం ఈ ప్రాంతం సందర్శనకు అనువుగా ఉండదు. మార్చ్ లో మొదలయ్యే ఎండాకాలం జూన్ వరకు కొనసాగుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూలై లో మొదలయ్యే వర్షాకాలమ సెప్టెంబర్ వరకు లేదా అక్టోబర్ ప్రారంభం వరకు కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాల వల్ల కురిసే జల్లులు ఎండాకాలం వేడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. జూలై మరియు ఆగష్టు నెలలలో అత్యధిక స్థాయి వర్షపాతం నమోదవుతుంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది.

చలికాలం

శీతాకాలం కోణార్క్ లోని శీతాకాలం ఆహ్లాదకరమైనది. అక్టోబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఉష్ణోగ్రత 12 డిగ్రీ సెల్సియస్ గా నమోదవుతుంది. పర్యాటకులు తమతో ఉన్ని వస్త్రాలను తీసుకువెళ్ళడం మరచిపోకూడదు.