Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొట్టారక్కర » వాతావరణం

కొట్టారక్కర వాతావరణం

ఉత్తమ సమయం కొట్టరక్కార పర్యటనకు వర్షాకాలం తర్వాత, వేసవి మొదలయ్యే కాలం అయిన సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలలో ఓణం పండుగలుంటాయి కనుక పండుగలు చూడాలనుకుంటే, ఈ నెలలలో కూడా దర్శించవచ్చు.

వేసవి

వాతావరణం వేసవి వేసవి మార్చి నుండి మొదలై మే నెల చివరి వరకు కొనసాగుతుంది. పట్టణం ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. వేసవి వేడి, శీతాకాలం చలి అధికం. ఏప్రిల్ మరియు మే నెలలు అత్యధిక వేడిగా ఉంటాయి.ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి. కొట్టరక్కర వేసవిలో సందర్శించాలనుకునేవారు కాటన్ దుస్తులు ధరించి వెళ్ళాలి.

వర్షాకాలం

వర్షాకాలం కొట్టరక్కర ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలను ఇస్తాయి. వర్షాకాలం జూన్ లో మొదలై సుమారు 4 నెలలు ఉంటుంది. అక్టోబర్ లో ఈ ప్రాంతం ఈశాన్య రుతుపవనాల కారణంగా కూడా వర్షాలు పొందుతుంది. జూన్ మరియు జూలై నెలలలో వర్షాలుంటాయి. అయినప్పటికి సైట్ సీయింగ్ కు అనుకూలమే.

చలికాలం

శీతాకాలం శీతాకాలపు చలి డిసెంబర్ నెలనుండి కూడా ఉండి జనవరి మరియు ఫిబ్రవరిలలో కొనసాగుతుంది. డిసెంబర్ అతి చల్లగా ఉండే కాలం. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పడతాయి. ఈ కాలం సైట్ సీయింగ్ కు ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, వాతావరణం బాగా పొడిగా ఉంటుంది.