కొల్లం జిల్లాలో కొట్టారక్కర ఒక చిన్న గ్రామం. ఇక్కడ ప్రధానంగా ప్యాలేసు లు మరియు దేవాలయాలు కలవు. ఈ గ్రామానికి ఈ పేరు రెండు మలయాళ పదాల వలన ఏర్పడింది. కోట్టారం అంటే రాజభవనం అని మరియు కర అంటే భూమి అని చెపుతారు. పేరుకి తగినట్లే ఈ గ్రామం ప్రసిద్ధిచెందింది. పూర్వపు రోజులలో కొట్టారక్కర ప్రాంతం ఎలయదత్తు స్వరూపంగా పిలువబడేది. ఇది. ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ అధీనంలో ఉండేది. చరిత్ర మేరకు ఇక్కడి మొదటి రాజ భవనాన్ని 14వ శతాబ్దంలో నిర్మించారు. మొత్తంగా ఏడు రాజ భవనాల శిధిలాలు ఇక్కడ కనపడతాయి.
కధాకళికి పుట్టినిల్లు
కొట్టరక్కరకు నేటికి కేరళలోని ఆధునిక సాంస్కృతిక చరిత్రలో కధాకళి కారణంగా ప్రధమస్ధానం కలదు.
కధాకళి పుట్టుక ఇద్దరు రాజుల మధ్య వచ్చిన వివాదాలకు గాను ఏర్పడింది. ఆ రాజులలో ఒకరు కొట్టరక్కర రాజు కాగా మరొకరు కొజికోడ్ రాజు.
రాజు కొట్టరక్కర తంపురన్ రామనాట్టం అనే డ్యాన్స్ ను కనిపెట్టాడు. దీని నుండే కధాకళి పుట్టుకు వచ్చింది. సామాన్య ప్రజలలో కధాకళికి ఒక పేరు తెచ్చినది కూడా ఈ రాజే. కొట్టరక్కర కారణంగా ఈ ప్రాంత సంస్కృతి ఇతర ప్రదేశాలకు విస్తరించింది.
ఆకర్షణల సమూహం
కొట్టరక్కరలో సైట్ సీయింగ్ అంటే, దేవాలయాలు, చర్చీలు, ప్యాలెస్ లు మరియు వ్యాపార కేంద్రాలు చూడాలి. కొట్టరక్కర శ్రీ మహాగణపతి దేవాలయం మరియు శ్రీ మణికంఠేశ్వర మహాదేవ దేవాలయం భక్తులను పర్యాటకులను ఒకే రకంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో ఇతర ఆకర్షణలు అంటే పాతానపురం, కొట్టరక్కర ప్యాలెస్ మరియు కిజాక్కేతేరువు ఆర్దోడాక్స్ వలియపల్లి ప్రదేశాలు. ఈ ప్రదేశం కొల్లంకు 27 కి.మీ.లు మరియు కేరళ రాజధాని కి 60 కి.మీ.ల దూరంలో ఉండి రైలు రోడ్డు మార్గాలలో తేలికగా చేరేదిలా కలదు. ఈ ప్రదేశంలో వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉండి పర్యాటకులను అన్ని కాలాలలోను ఆకర్షిస్తుంది. కొట్టరక్కర పర్యటన కొల్లం ప్రాంతం చుట్టు పట్ల కల ప్రదేశాలతో కలిపి చూడవచ్చు.