Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమావున్ » వాతావరణం

కుమావున్ వాతావరణం

కుమావున్ ఏడాది పొడవునా ఆహ్లాదమైన ఉష్ణోగ్రతలు కలిగి ఉండటం వల్ల, సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు.

వేసవి

వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్): వేసవి కాలం ఏప్రిల్ నెల నుండి జూన్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ సమయంలో, ఈ ప్రాంత గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 46 ° సెం. మరియు 19 ° సెం. వరకు ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్): కుమవోన్ లో, వర్షాకాలం జులై, సెప్టెంబరు నెలల మధ్య విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం సగటు వర్షపాతం కలిగి ఉంటుంది. అందువల్ల కుమవోన్ సందర్శించే ప్రయాణికులు అవసరమైన వర్షపు దుస్తులు తీసుకురావాలని సలహా ఇస్తారు.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి): కుమవోన్ లో శీతాకాలం అక్టోబర్ మరియు ఫిబ్రవరి నెలల మధ్య విస్తరించి ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతంలో నమోదు అయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 25 ° సెం. కనిష్ట ఉష్ణోగ్రత 4 ° సెం. ఈ కాలంలో కుమవోన్ పర్యటించే ప్రయాణికులు అవసరమైన ఉన్ని బట్టలు తీసుకురావటం అవసరం.