Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుంబకోణం » వాతావరణం

కుంబకోణం వాతావరణం

ఉత్తమ సీజన్ కుంబ కోణం సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ అనుకూలం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పర్యటనకు అనుకూలం. సైట్ సీయింగ్ ఆనందకరంగా వుంటుంది. ఈ సమయంలోనే ఈ ప్రాంతంలో కొన్ని మతపర వేడుకలు కూడా జరుగుతాయి. ఈ సమయంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్య లో వస్తారు.

వేసవి

వేసవి కుంబకోణంలో వేసవి మార్చ్ లో మొదలై మే చివరి వరకు వుంటుంది. ఈ సమయంలో అధిక వేడి, మరియు తేమ. ఉష్ణోగ్రతలు కనిష్టం 32 డిగ్రీలు గరిష్టం 38 డిగ్రీలు గా వుంటుంది. ఇక్కడ కల అధిక వేడి తప్పక ఆరోగ్య సమస్యలు కూడా కలిగిస్తుంది. కనుక ఈ సమయంలో సందర్సన సూచించ దగినదికాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ మధ్యలో మొదలై ఆగష్టు చివరి వరకూ వుంటుంది. ఈ సమయంలో అధిక వర్షాలు పడతాయి. ఉష్ణోగ్రతలు తగ్గి ఆహ్లాదంగా వుంటుంది. అయితే వర్షాల కారణంగా సైట్ సీయింగ్ కష్టం అవుతుంది. కనుక పర్యాటకులు అధికంగా సందర్శించరు.

చలికాలం

శీతాకాలం కుంబకోణంలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. అయితే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 20 నుండి 25 డిగ్రీల వరకూ కొనసాగుతాయి. కనుక ఉన్ని దుస్తులు ధరించటం మంచిది. వాతావరణం ఈ సమయంలో ఆహ్లాదకరంగా వుండి పర్యటన అనుకూలంగా వుంటుంది.