Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» లేపాక్షి

లేపాక్షి - ఆలయాల నగరం

19

అనంతపూరు జిల్లాలో భాగమైన లేపాక్షి దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన ఒక  కుగ్రామం. కర్ణాటక లో ని బెంగుళూరు నుండి 120కిలోమీటర్ల దూరంలో అలాగే హిందూపూర్ నగరం నుండి 15 కిలో మీటర్ల దూరం లోఉంది. చిన్నదైనా, ఈ కుగ్రామంలో ఎన్నో చారిత్రాత్మక అలాగే ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినవి ఎన్నో ఉన్నాయి.

దక్షిణ భారత దేశంలో  మహా శివుడు, మహావిష్ణువు, వీరభద్ర స్వామి ల కి అంకితమివ్వబడి, ప్రఖ్యాతి గాంచిన మూడు ఆలయాలు ఈ ప్రాంతం లో ఉన్నాయి. తాబేలు వెనుక భాగాన్ని పోలి ఉన్న ఆకారంలో ఉన్న ఒక చిన్న పర్వతానికి కూడా ఈ ప్రాంతం ప్రాముఖ్యత చెందింది. ఈ పర్వతం పైన  కూర్మ శైల. శ్రీరామ, రఘునాథ, వీరభద్ర, పాపనాథేస్వర ఇంకా దుర్గమ్మ వారి ఆలయాలు  ఉన్నాయి.

కఠినమైన ఆలయ రాతి గోడల పై చేక్కేందుకు నియమింపబడిన విశ్వబ్రాహ్మణుల కళా నైపుణ్యానికి నిదర్శనం ఇక్కడున్న ఆలయాలపై ప్రదర్శింపబడిన వారి పనితనం. ఈ ఆలయ ఆకృతి అలాగే నిర్మాణం శైలిలో ప్రఖ్యాతి గాంచిన విశ్వకర్మ శిల్పి అమర శిల్పి జక్కనచారి హస్తం ఉందని  చాలామంది నమ్మకం.

కాకోజు అలాగే మొరోజు అనబడే ఆ కాలపు పేరుగాంచిన శిల్పులు కూడా ఈ ఆలయ గోడలపై ఉన్న హస్త కళా నైపుణ్యానికి సహాయ పడ్డారని చెపుతారు. భారత పౌరాణిక గ్రంధాలైన రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలనుంది  తీసుకోబడిన వివిధ ఘట్టాలను ఈ ఆలయ గోడలపై వర్ణించారు. ప్రసిద్ద మైన లేపాక్షి చీరల డిజైన్ లు కూడా ఈ ఆలయ గోడలపై ఉన్న చెక్కడాల ద్వారా ప్రభావితమయ్యాయన్నది ఆసక్తికరమైన అంశం.  వేలాడే స్థంభం, రాతి గొలుసు, వాస్తు పురుషుడు, పందెపు స్త్రీ వంటి ఎన్నో వివిధ ప్రత్యేకతలకి ఈ ఆలయం ప్రసిద్ది చెందినది. సహజ రంగులని ఉపయోగించి చిత్రీకరించిన అందమైన చిత్రలేఖనాలతో ఈ ఆలయ పై కప్పు అలంకరించబడినది.

ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన ఆకర్షణ వీరభద్రుని ఆలయం. దక్షిణ భారత దేశం నుండి ఏంతో మంది భక్తులు వీరభద్రుని దర్శనార్ధం ఇక్కడికి విచ్చేస్తూ  ఉంటారు. ఎండాకాలంలో విపరీతంగా ఎండలు ఉన్న సమయంలో తప్పించి ఏడాది పొడవునా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా నే ఉంటుంది. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లేకపోవడం వలన లేపాక్షి కి చేరుకునేందుకు ఉత్తమమైన రవాణా రోడ్డు మార్గం. నిర్మాణ కళ మరియు రంగుల లోకం ఈ నగరం. చారిత్రాత్మక అంశాలపై పురాణ అంశాలపై ఆసక్తి కలిగిన వారిని ఈ ప్రాంతం అమితంగా ఆకర్షిస్తుంది.

లేపాక్షి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లేపాక్షి వాతావరణం

లేపాక్షి
30oC / 86oF
 • Sunny
 • Wind: E 24 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం లేపాక్షి

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? లేపాక్షి

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం బెంగుళూరు నుండి వచ్చేటట్లయితే ఏడవ నంబర్ జాతీయ రహదారి ద్వారా లేపాక్షి ని చేరుకోవచ్చు. అనంతపూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అలాగే హైదరాబాద్ నుండి 476 కిలోమీటర్ల దూరంలో ఈ లేపాక్షి గ్రామం ఉంది. దగ్గరలో ఉన్న పట్టణాలు, నగరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన రెగ్యులర్ బస్సు సర్వీసులను లేపాక్షి కి నడుపుతోంది. హైదరాబాద్ మరియు బెంగుళూరు నగరాల నుండి లేపాక్షి కి చేరుకునేందుకు డీలక్స్ బస్సుల సౌకర్యం కలదు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం లేపాక్షి లో రైల్వే స్టేషన్ లేదు. అనంతపూర్ కి వెళ్ళే మార్గం ఉన్న రైలు ద్వారా లేపాక్షి కి చేరుకోవచ్చు. దృఢమైన నెట్వర్క్ కలిగిన రైళ్ళ ద్వారా అనంతపూర్ లో ఉన్న రైల్వే స్టేషన్ దేశం లో ని వివిధ భాగాలకి చక్కగా అనుసంధానమై ఉంది. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై మరియు ఢిల్లీ రైళ్ళు అనంతపురం పట్టణాన్ని దాటుకుంటూ వెళతాయి. అనంతపూర్ రైల్వే స్టేషన్ నుండి టాక్సీ లేదా బస్సు సేవలని ఉపయోగించి లేపాక్షి కి చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం లేపాక్షి కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. హైదరాబాద్ లో ని విమానాశ్రయం లో జాతీయ, అంతర్జాతీయ విమానాలు తిరుగుతాయి. దేశం లో ని పరదాల నగరాలనుండే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా విమానాల రాకపోకలు ఉంటాయి. ఈ విమానాశ్రయం నుండి ప్రైవేట్ క్యాబ్ ద్వారా లేపాక్షి నగరానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి రైలు మార్గం ద్వారా కూడా లేపాక్షి కి చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి

లేపాక్షి ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Feb,Thu
Return On
22 Feb,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Feb,Thu
Check Out
22 Feb,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Feb,Thu
Return On
22 Feb,Fri
 • Today
  Lepakshi
  30 OC
  86 OF
  UV Index: 13
  Sunny
 • Tomorrow
  Lepakshi
  22 OC
  71 OF
  UV Index: 13
  Sunny
 • Day After
  Lepakshi
  22 OC
  71 OF
  UV Index: 13
  Sunny

Near by City