Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లేపాక్షి » వాతావరణం

లేపాక్షి వాతావరణం

అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు లేపాక్షి ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ మాసాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా ప్రయాణానికి, ప్రాంతాల సందర్శనకి అనువుగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ మాసాల్లో దక్షిణ భారత దేశ పర్యటన ని ఎంతో మంది పర్యాటకులు ప్రాధాన్యమిస్తారు. సాయంత్రం ఇంకా రాత్రి వేళల్లో చలి తట్టుకునేందుకు ఒక స్వెట్టర్ ని మీతో సదా ఉంచుకోవడం ఉత్తమం.

వేసవి

ఎండాకాలం లేపాక్షి లో ని ఎండాకాలం లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఇక్కడి ఉష్ణోగ్రత నమోదయ్యి మధ్యాహ్నం పూట ఎండ వేడి తట్టుకోలేని విధంగా ఉంటుంది. సాయంత్రాలు కూడా వాతావరణం వేడిగానే ఉంటుంది. ఉత్తర భారత దేశం యొక్క వడగాలులు కూడా ఎండాకాలంలో లేపాక్షి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచవు. మార్చ్ నెల ప్రారంభం లో మొదలయ్యే ఎండాకాలం జూన్ నెల మధ్య వరకు కొనసాగుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం :జూన్ నెల మధ్యలో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. సాధారణం నుండి భారీ వర్షపాతాలు నమోదవుతాయి. 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. లేపాక్షి లో ని ప్రజలు వర్షాకాలం వర్షాలని ఆనందిస్తారు. కానీ గాలి లో ని తేమ శాతం కొంచెం ఇబ్బంది పెడుతుంది. అక్టోబర్ నెలలో కూడా చిరుజల్లులు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం లేపాక్షి లో ని శీతాకాలం ఉత్తర భారత దేశం లోని శీతాకాలాన్ని పోలి ఉండదు. 27 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుంది. కానీ బాగా చలిగా మాత్రం వాతావరణం మారదు. డిసెంబర్ ప్రారంభంలో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి మాసం చివరి వరకు కొనసాగుతుంది. శీతాకాలం లో ఎండ ఎక్కువసేపు ఉండకపోయినా వాతావరణం వెచ్చగా మారుతుంది. సాయంత్రం అలాగే రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా మారుతుంది.