Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » వాతావరణం

లోనావాలా వాతావరణం

సందర్శించడానికి సరైన సమయంలోనావాలా ప్రయాణీకులకు బాగా ఇష్టమైన పర్వత ప్రాంతాలలో ఒకటి – అందుకు బలమైన కారణాలే వున్నాయి. ముంబై వాసులు రద్దీగా,కాలుష్యమయంగా వుండే నగర జీవితంతో వారం అంతా ఉక్కిరిబిక్కిరయాక వారాంతాల్లో ఈ ప్రాంతానికి విహార యాత్ర కోసం వచ్చి పునరుత్తేజం పొందుతారు.

వేసవి

వేసవిగరిష్ట ఉష్ణోగ్రత 30-35 డిగ్రీల వరకు వుండడం తో వేసవిలో లోనావాలా వాతావరణం సాధారణంగా మందంగా ఉంటుంది. అప్పుడప్పుడు కురిసే జల్లులతో, స్థిరమైన కొండ గాలి ఆ పర్వత ప్రాంతాన్ని ఎంతో మనోహర౦గా తయారు చేస్తుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం ఈ ప్రాంతాన్ని స్వర్గధామంగా మారుస్తుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ప్రబలంగా వర్షాలు పడే ఈ పర్వత ప్రాంతం ప్రతీ ఏటా భారీ నైరుతి వర్షాల కారణంగా 450 సెంటీ మీటర్ల సగటు వార్షిక వర్షపాతం చవిచూస్తుంది. ఈ ఋతువులో ఈ ప్రాంతం కళకళలాడుతూ వుండి తన అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాల్లో గుబాళించే వర్షపు వాసన మీకు మత్తెక్కిస్తుంది – లోనవాలా అందాలను చూడాలంటె జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలోనే వెళ్ళాలనేది నిర్వివాదాంశం.

చలికాలం

శీతాకాలంశీతాకాలం లో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. వాతావరణం 12 డిగ్రీల వద్ద ఉండి బాగా చల్లగా ఉంటుంది. పగలు వెచ్చగా, ఆహ్లాదకరంగా ఉండి, రాత్రులు చాలా చల్లగా ఉంటాయి. లోనావాలా క్రిస్మస్, కొత్త సంవత్సర సందర్భాల్లో ప్రముఖ పర్యాటక ప్రదేశం.