Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్నో » వాతావరణం

లక్నో వాతావరణం

ఉత్తరభారత దేశంలోని ఇతర నగరాల వలె, లక్నో వేడి, పొడి, దుమ్ముకోట్టుకునే వేసవితో, చల్లని శీతాకాలంతో తీవ్రమైన ఉష్ణోగ్రతలను కలిగిఉంటుంది. మే, జూన్ మాసాల సమయంలో ఉండే వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. అక్టోబర్ నుండి మార్చ్ లోపు ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.

వేసవి

వేసవి మార్చ్ నుండి మే వరకు ఉండే వేసవి సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత చాలా వేడిగా, పొడి గాలులను కలిగిఉంటుంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వర్షాకాలం

వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉండే వేసవికాలం లో అడపాదడపా వచ్చే వర్షాలు భారీగా ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం పొడిగా, తేమగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు విస్తరించి ఉంటుంది. వాతావరణం 12 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉష్ణోగ్రతతో మధ్యస్తంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. జనవరి నెల తీవ్రమైన పొగమంచుతో నిండిఉండడం వల్ల విమానాలు రాద్దుచేయబడతాయి, రైళ్ళు ఆలస్యంగా నడుస్తాయి.