ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం చేత శీతాకాలం లుంగ్లీ జిల్లా ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. అయినప్పటికీ, ఈ సమయం లో పర్యాటకులు తమతో ఊలి దుస్తులను తెచ్చుకోవడం సిఫార్సు చేయదగినది. సాహసోపేతమైన మరియు ఔత్సాహికులైన పర్యాటకులు లుంగ్లీ జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించవచ్చు.
ఎండాకాలం ఎండాకాలం లో, 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. మార్చ్ లో మొదలయ్యే ఎండాకాలం మే చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ని లుంగ్లీ పర్యటన ఆసక్తికరంగా ఉంటుంది.
వర్షాకాలం జూన్ నెలలో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ నెలలలో, ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. భారీ వర్షపాతం వల్ల, జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలకి చేరుకోవడం కష్టతరంగా ఉంటుంది.
శీతాకాలం అక్టోబర్ చివర ని మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ శీతాకాలం నెలలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఉష్నోగ్రత ఇబ్బంది పెట్టేలా ఉండదు. 21 డిగ్రీల సెల్సియస్ నుండి 11 డిగ్రీల సెల్సియస్ వరకు ఇక్కడ ఉష్ణోగ్రత నమోదవుతుంది. శీతాకాలం లో పర్యటనకు ఊలి వస్త్రాలు అందుబాటులో ఉంచుకోవాలి.