Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మహాబలిపురం

మహాబలిపురం - సముద్రతీర సుందర దృశ్యాలు !

39

మహాబలిపురంను నేడు అధికారికంగా మామల్లాపురం అని పెర్కొంటున్నారు. ఈ ప్రదేశం తమిళ్ నాడులోని కాంచీపురం జిల్లాలో కలదు. ఈ రేవు పట్టణం 7 వ శతాబ్దం లో ఖ్యాతి గాంచిన పల్లవ రాజుల పాలనలో కలదు. ఈ పట్టణం 7 వ మరియు 9 వ శాతాబ్డాల మధ్య కల అనేక స్మారకాలు కలిగి వుంది. దీనిని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. మహాబలిపురం బంగాళా ఖాతానికి అభిముఖంగా కోరమండల్ తీరంలో కలదు. పల్లవుల పాలనలో అంటే క్రి.శ.650 నుండి 750 వరకూ ఈప్రదేశంలో అనేక కళలు, పురావస్తు,శిల్ప సంపద,సాహిత్యం, డ్రామాలు మరియు అనేక ఇతర సాంస్కృతిక రంగాలు అభివృద్ధి చెందాయి. నేటికాలంలో అంటే 2001 నాటి జనాభా లెక్కల మేరకు మహాబలిపురంలో సుమారు 12,345 కుటుంబాలు నివసిస్తున్నట్లు వెల్లడైంది. అయితే సంవత్సరం అంతా ఇక్కడి ఆకర్షణలు దర్సించేందుకు వచ్చే పర్యాటకులతో ఈపట్టణం కిట కిట లాడుతూ వుంటుంది.

మహాబలిపురం చుట్ట పట్ల ఆకర్షణలు పల్లవులకాలంలో ఈ పట్టణం ఎంతో వైభవాన్ని చవిచూసింది. పల్లవ రాజులు ఇక్కడ కల సహజ వనరలను గ్రహించి వాటినిపూర్తిగా వినియోగించారు. వారు ఈ నగర నిర్మాణం కొరకు ఎంతో శ్రమించారు. పల్లవ రాజుల కళా తృష్ణకు మహాబలిపురం ఒక నిదర్సనంగా వుంటుంది. సుమారు 18 వ శతాబ్దం వరకూ మహాబలిపురం ప్రాంతం గురించి బయట ప్రపంచానికి తెలియదు. దండయాత్రల భయం తో పల్లవ రాజులు తమ పట్టణ అభివృద్ధిని అంతా రహస్యంగా ఉంచేవారు. పల్లవరాజులలో నరసింహ 1 మరియు రాజసింహలు ఈ నిర్మాణాల శిల్ప నైపుణ్యతను కాపాడేందుకు అభివృద్ధికి ఎంతో శ్రమించారు.

ఆకర్షణలు కొండరాతి గుహలు, వెండి రంగు ఇసుక బీచ్, సరివి చెట్లు, ఇక్కడకల దేవాలయాలు అన్నీ ఈ చారిత్రక టవున్ లో అద్భుతాలుగా వుంటాయి. చారిత్రాత్మక పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు, స్మారకాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కృష్ణ మండపం, అయిదు రధాలు, వరాహ మండపం సముద్ర తీర టెంపుల్, వంటివి ఎన్నో కలవు. టవున్ నుండి 30 కి.మీ.ల దూరంలో చోళ మండల ఆర్టిస్ట్ విలేజ్ కలదు. ఇక్కడ మీరు అనేక పెయింటింగ్ లు కళా వస్తువులు, శిల్పాలు చూడవచ్చు.

పల్లవుల సామ్రాజ్య అభివృద్ధికి ఇక్కడే కల బీచ్ మరింత శోభను చేకూరుస్తుంది. దీనిలో పర్యాటకులు ఉదయం నుండి సాయంత్రం వరకూ విశ్రమిస్తారు. టవున్ కు అయిదు కి.మీ.ల దూరంలో ఒక దుర్గ మాత టెంపుల్ కలదు. దీనిలో అనేక విగ్రహ మూర్తులు కలవు. సమీపంలోని టైగర్ కేవ్ మొసళ్ళ పార్కు కూడా ఆకర్షణీయ ప్రదేశాలు. పర్యాటకులు సంవత్సరం పొడవునా చూడదగిన సుందర దృశ్యాలు కలవు.

మహాబలిపురం చరిత్ర పరిశీలిస్తే ఇప్పటి మహాబలిపురాన్ని మహాబలి అనే ఒక క్రూర రాజు పాలించేవాడు. ఆయను భగవంతుడైన శ్రీ మహావిష్ణువు వధించాడు. కనుక ఈ పట్టణానికి ఆయన పేరుతో మహాబలి వూరు లేదా మహాబలిపురం అనేపేరు వచ్చింది.

మహాబలి పురం ఎలా చేరాలి ? ఈపట్టణం సమీప పట్టణాల నుండి తరచుగా బస్సులతో కలుపబడి వుంది. స్థానికులతో మాట్లాడటం ఏమంత కష్టం కాదు. ఇక్కడ తమిళం తోపాటు వీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు.

మహాబలిపురం వాతావరణం

సమీపంలో సముద్రం వుండటం చే ఇక్కడ వాతావరణం సముద్రపు గాలులతో వేడిగాను మరియు తేమతో కూడిన చల్లదనంతోను వుంటుంది.

మహాబలిపురం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మహాబలిపురం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మహాబలిపురం

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? మహాబలిపురం

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ప్రయాణం మహాబలిపురం టవున్ సమీప ప్రదేశాల నుండి మరియు చెన్నై నుండి ప్రైవేటు లేదా ప్రభుత్వ బస్సు సర్వీస్ లు కలిగి వుంది. మార్గంలో పర్యాటకులు సునామి వలన నష్ట పోయిన ప్రదేశాలు కూడా చూడవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం మహాబలిపురానికి సమీప రైలు స్టేషన్ 29 కి.మీ.ల దూరంలోని చెంగల్పట్టులో కలదు. ప్రధాన రైలు స్టేషన్ చెన్నై. ఇక్కడ నుండి ఇండియాలోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. చెంగల్ పట్టు నుండి మహాబలి పురానికి రూ. 600 టాక్సీ చార్జీ. మరియు చెన్నై నుండి మహాబలిపురానికి రూ.1,400 టాక్సీ చార్జీ గా వుంటుంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన ప్రయాణం మహాబలిపురానికి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం. సుమారు 54 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ ఇండియా మరియు విదేశాలకు విమాన సర్వీస్ లు కలిగి వుంది. చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి మహాబలిపురం చేరేందుకు టాక్సీ చార్జీలు రూ.1,200గా వుంటుంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Jan,Sat
Return On
29 Jan,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
28 Jan,Sat
Check Out
29 Jan,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
28 Jan,Sat
Return On
29 Jan,Sun