Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోకోక్చుంగ్ » వాతావరణం

మోకోక్చుంగ్ వాతావరణం

ఉత్తమ సమయం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో న్యూ ఇయర్ ని జరుపుకోవడం ఒక గొప్ప అనుభూతిని కల్గిస్తుంది.

వేసవి

వేసవి ఇతర అస్సాం ప్రదేశాలతో పోలిస్తే వేసవి అంత వేడిగా ఉండదు, రాత్రులు చాల చలిగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెంటి గ్రేడ్ గా ఉంటుంది.

వర్షాకాలం

వర్షా కాలం ఇక్కడ వానలు విరివిగా కురుస్తుంటాయి. సంవత్సరంలో తొమ్మిది నెలలు ఇక్కడ వర్షాలు కురుస్తూ ఉంటాయి. జూలై నుండి ఆగష్టు వరకు భారి వర్షాలు కురుస్తూ ఉంటాయి. 2500 మీ.మీ. గా సగటు వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం ఈ ప్రాంతంలో జనవరి మరియు ఫిబ్రవరి నెలలు అత్యంత శీతలమైనవి. రెండు డిగ్రీల కంటే తక్కువగా ఇక్కడ ఉష్ణోగ్రత పడిపోతుంది. అయినప్పటికీ సాధారణంగా శీతాకాలంలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత 11 నుండి 23 డిగ్రీల మధ్యలో నమోదవుతుంది.