Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోన్ » వాతావరణం

మోన్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం మూడు కాలాలలో ప్రతి ఒక్కటి మోన్ ప్రాంతాన్ని ఏదో ఒక రూపంలో మారుస్తుంది. అందువల్ల మీరు ఏ సమయంలోనైనా మోన్ సందర్శించవచ్చు. అయితే, చూడడానికి వేసవి, శీతాకాల సమయాలు పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది చెందాయి. వేసవి కాలంలో కొన్యకులు జరుపుకునే ఆలంగ్ మొన్యు పండుగకు హాజరు కావచ్చు.

వేసవి

వేసవి వేసవిలో మీరు మోన్ సందర్శించాలంటే, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే మార్చ్ నుండి మే సమయం మాత్రమే అనుకూలం. ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. మరోవైపు, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు కంటే పడిపోదు. అయితే, ఈ రోజులు చాలా తేమతో కూడుకొని ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం ఋతుపవనాలు మే చివరి వారంలో మొదలై అక్టోబర్ వరకు వ్యాపించి ఉంటాయి. వర్షపాతం 76 శాతం తేమతో చాలా ఎక్కువగా ఉంటుంది. మోన్ వర్షాకాలంలో ఎప్పుడూ పచ్చగా, చుట్టూ అందమైన కొండలతో విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.

చలికాలం

శీతాకాలం డిసెంబర్, ఫిబ్రవరి శీతాకాల సమయంలో, మోన్ ఎంతో చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పడిపోతుంది. శీతాకాలంలో క్రిస్టమస్ ఉన్నందున ఈ సమయంలో సందర్శకులు ఆసక్తికరమైన మోన్ ను చూస్తారు. శీతాకాలంలో అనేకమంది పర్యాటకులు మోన్ పర్యటనకు ప్రాధాన్యతను ఇస్తారు.