Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముస్సూరీ » వాతావరణం

ముస్సూరీ వాతావరణం

పర్యటనకు మంచి సమయం.అందమైన ముస్సూరీ హిల్ స్టేషన్ సందర్శనకు మార్చ్ నుండి జూన్ వరకూ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు గలసమయం అనుకూలమైనది. సాహస క్రీడలలో ఆసక్తి కల పర్యాటకులు ఈప్రదేశాన్ని సమ్మర్ లో సందర్సించాలి. ఈ సమయం లో వారు పర్వతారోహణ ,ట్రెక్కింగ్, కామ్పింగ్,చేయవచ్చు. అయితే రాఫ్టింగ్ క్రీడలు ఆచరిన్చాలనుకునేవారు ఇక్కడకు వర్షాకాలం వెళ్ళిన వెంటనే అంటే సెప్టెంబర్ మరియు నవంబర్ ల మధ్య వచ్చి ఆనందించవచ్చు.

వేసవి

ముస్సూరీ లో సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. వేసవులలో పర్యాటకులు అధిక సంఖ్యా లో వస్తారు. వేసవి ముస్సూరీ లో వేసవి మార్చ్ నుండి జూన్ వరకు వుంటుంది. వేసవులలో వాతావరణం చల్లగా వుంది గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 27 డిగ్రీలు గా వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం ముస్సూరీ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ సమయం లో వర్షాలు ఒక మోస్తరు గా పడతాయి.

చలికాలం

శీతాకాలం ముస్సూరీ లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు జీరో కంటే కూడా తక్కువకు పది పోతాయి. ప్రాంతం అంతా పూర్తిగా మంచు తో కప్పబడి పోతుంది. ఫలితంగా, రోడ్లు సైతం బ్లాక్ అయిపోతాయి. ఈ సమయం లో సందర్శనకు వచ్చే వారు తప్పక ఉన్ని దుస్తులు అధికంగా ధరించాలి.