Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగపట్నం » వాతావరణం

నాగపట్నం వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకూ గల కాలం నాగ పట్టినం సందర్శనకు సరి అయినది అయినప్పటికీ టూరిస్టులు సంవత్సరం పొడవునా దీనిని సందర్సిస్తూనే వుంటారు. ఏప్రిల్, మే నెలలు యాత్రలకు సరి అయినవి. వర్షాకాలం మరియు శీతాకాలాలు లో ఈ ప్రాంతం పచ్చదనం, పూవులు కలిగి వుండటంచే ఈ సమయం కూడా సందర్శనకు సరైనదే.

వేసవి

వేసవి నాగ పట్టినంలో వేసవి మార్చ్ లో మొదలై మే వరకూ వుంటుంది. ఈ నెలలు అధిక వేడిగాను, పొడి గానూ వుంటాయి. ఉష్ణోగ్రతలు కనిష్టం 28 డిగ్రీలు, గరిష్టం 38 డిగ్రీలుగా వుంటుంది. సాయంకాలాలు సముద్ర తీరం నుండి వచ్చే గాలులు చల్లగా వుంటాయి. ఈ సమయంలో వాతావరణం బాగా లేకపోయినప్పటికీ ఇది యాత్రల సమయం కనుక కొంత మంది పర్యాటకులు దర్శిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం నాగ పట్టినంలో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ ఒక మోస్తరు నుండి మధ్యస్థం వరకూ వర్షాలు పొందుతుంది. వర్షాలు పడ్డ తర్వాత ఈ ప్రదేశం పచ్చటి ప్రాంతాలతో, పూవులు, పండ్లతో ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. చిన్నపాటి సందర్శనలకు ఇది మంచి సమయం.

చలికాలం

శీతాకాలం నాగ పట్టినం లో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుండే శీతాకాలం సందర్శనకు సరి అయినది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకూ మార్పు చెందుతూ ఆహ్లాదంగా వుంటుంది. నాగ పట్టిన సందర్శనకు ఇది ఉత్తమ సమయం