ప్రయాణానికి ఉత్తమ సమయం: అక్టోబర్, నవంబర్ మధ్య ఇక్కడి వాతావరణం చాలా ప్రసాంతంగా ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో నాగౌర్ కి శెలవులలో సందర్శించడం ఉత్తమం.
అపుడపుడు వచ్చే వర్షాలతో సంవత్సరం మొత్తం మీద నాగౌర్ జిల్లాలోని వాతావరణం పొడిగా ఉంటుంది. వేసవిలో నాగౌర్ లో చాలా సాధారణంగా ఇసుక తుఫానులు వస్తాయి. వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): వేసవి కాలం మార్చ్ నెలలో ప్రారంభమై జూన్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు,35 డిగ్రీలుగా నమోదవుతాయి. ఈ సమయంలో మే నెలలో ఎక్కువ వేడి ఉంటుంది.
వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): నాగౌర్ లో వర్షాకాలం జులై లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలంలో నాగౌర్ లో అపుడపుడు, అనుకోకుండా వర్షాలు పడతాయి.
శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు): నాగౌర్ జిల్లలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు, 5 డిగ్రీలుగా నమోదవుతాయి.