Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నరకంద » వాతావరణం

నరకంద వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం: నరకంద పర్యటించడానికి ఉత్తమ సమయం, విహారానికి అనుకూలమైన వేసవి కాలం. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల సందర్శకులు, శీతాకాలంలో ఈ ప్రదేశానికి ప్రయాణించడానికి సిఫార్సు చేయనప్పటికీ, స్కీయింగ్ మరియు ట్రెక్కింగ్ ఆసక్తి గల వారు, తప్పక సందర్శించాలి.

వేసవి

నరకంద లో సమశీతోష్ణ వాతావరణం ఉండటం వల్ల, పర్యాటకులు సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఇక్కడకి రావచ్చు. ఇక్కడ ప్రధానంగా వేసవి, వర్షాకాలం మరియు శీతాకాలం ఉంటాయి.వేసవి (ఏప్రిల్ నుండి జూన్): ఏప్రిల్ నెల నుండి మొదలయి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో, నరకంద మృదువైన వాతావరణం కలిగి ఉంటుంది. ఇక్కడ అనుభవించే గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30˚ సెం. మరియు 10 ˚ సెం. ఉన్నాయి.ఈ కాలం, సందర్శకులకు పూర్తిగా వికసించిన ఆపిల్ చెట్ల అందమైన దృశ్యాలు చూసే అవకాశం అందిస్తుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబరు): నరకంద లో ఋతుపవన కాలం జూలై నెలలో మొదలయి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలోని మధ్యస్థ వర్షపాతం, ఈ ప్రదేశ దృశ్యాలని మరింత స్పష్టంగా మరియు పచ్చగా కనిపించేటట్టు చేస్తుంది. రాత్రులు, ఈ కాలంలో చాలా చలిగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలాలు (అక్టోబర్ నుండి ఫిబ్రవరి): నరకంద లో శీతాకాలం అక్టోబర్ నెల నుండి మొదలయి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో, గరిష్ట ఉష్ణోగ్రత 15˚ సెం. వరకు వెళ్ళవచ్చు మరియు కనిష్ట ఉష్ణోగ్రత -10˚ సెం. వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈ సమయం లో హిమపాతం కనిపిస్తుంది.