Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాసిక్ » వాతావరణం

నాసిక్ వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం చలికాలం మరియు వర్షాకాలం నాశిక్ పర్యటనకు అనుకూలమైనది.  నాశిక్ వాతావరణం నాశిక్ పట్టణం ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. వేసవులు అధిక వేడి, శీతాకాలం అధిక చలిగా ఉంటుంది. 

వేసవి

వేసవి కాలం నాశిక్ ప్రాంతంలో వేసవి మార్చి నుండి మే వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ సమయంలో పర్యటన వద్దని కూడా సూచిస్తారు.  ప్రత్యేకించి ఏప్రిల్ మరియు మే నెలలు అధిక వేడి చూపుతాయి.

వర్షాకాలం

వర్షాకాలం నాశిక్ లో వర్సాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. తేలికపాటి జల్లులు మరియు ఒక మోస్తరు వర్షాలు పడి వేడి నుండి ఊరట నిస్తాయి. ఈ సమయంలో ప్రాంత పర్యటన బాగానే ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం శీతాకాలపు నెలలు ఈ ప్రాంతంలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటాయి. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను ఉంటాయి. నాసిక్ పట్టణ సందర్శనకు ఈ సమయం అంటే అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది.