Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ నుంచి ఐఆర్‌సీటీసీ సౌత్ ఇండియా టూర్ ప్యాకేజ్‌

విశాఖ నుంచి ఐఆర్‌సీటీసీ సౌత్ ఇండియా టూర్ ప్యాకేజ్‌

విశాఖ నుంచి ఐఆర్‌సీటీసీ సౌత్ ఇండియా టూర్ ప్యాకేజ్‌

ఈ వ‌ర్షాకాలంలో ఎక్క‌డికైనా కుటుంబ స‌మేతంగా యాత్ర‌కు వెళ్లాల‌నుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం స‌రికొత్త ప్యాకేజీని ప్ర‌క‌టించింది. సీజ‌న్‌తో సంబంధం లేకుండా నిత్యం ప్ర‌యాణికుల‌ను ఆక‌ర్షించే ప్యాకేజీలు అందించ‌డంలో ఐఆర్‌సీటీసీ ముందుంటుంది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకుని, ఫ్లైట్‌లో సౌత్ ఇండియా టూర్ ప్యాకేజ్‌ను విడుదల చేసింది. గ‌గ‌నత‌ల‌పై విహ‌రిస్తూ.. ప‌ర్యాట‌క కేంద్రాల‌ను త‌నిపితీరా చూడాల‌ని కోరిక ఉన్న‌వారు ఇక ఆల‌స్యం చేయ‌కుండా ఈ ప్యాకేజ్ వివ‌రాల‌ను తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ సదరన్ డివైన్ టెంపుల్ టూర్ పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్లాలనుకునే ఇది మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పొచ్చు. ఎంతో ప్రాముఖ్య‌త గ‌ల ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను ఈ టూర్ ప‌రిచ‌యం చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం లాంటి ప్రాంతాల‌ను ఎంచ‌క్కా చుట్టేయ‌వ‌చ్చు. ఆగస్ట్ 12న ఈ టూర్ ప్రారంభం కానుంది. మొత్తంగా ఐదు రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీలో గ‌తంలో మాదిరిగా కాకుండా చాలా వెసులుబాట్లు క‌ల్పించారు.

coverbudget-trip -irctc-1

పర్యాటకుల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లి దక్షిణ భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చూపించనుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం సదరన్ డివైన్ టెంపుల్ టూర్ మొదటిరోజు విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. ఉదయం 8.55 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే 10.20 గంటలకు చెన్నై చేరుకుంటారు. చెన్నైలో మధ్యాహ్నం 12.50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 2.05 గంటలకు మదురై చేరుకుంటారు.

మొద‌టిరోజు సాయంత్రం మదురైలో మీనాక్షి దేవి ఆలయ సందర్శన ఉంటుంది. సమీపంలోని ఇతర ఆలయాలు చూడొచ్చు. రాత్రికి మదురైలో బస చేయాలి. రెండో రోజు ఉదయం రామేశ్వరం బయల్దేరాలి. ఆ తర్వాత ధనుష్కోటి సందర్శించవచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు రామేశ్వరం సైట్ సీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి చేరుకోవాలి. ఆ రాత్రికి కన్యాకుమారిలో బస చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు సన్‌రైజ్ పాయింట్‌లో సూర్యోదయాన్ని సందర్శించవచ్చు.

irctcpackage-2

ఆ తర్వాత కన్యాకుమారి సైట్ సీయింగ్ ఉంటుంది. సాయంత్రం త్రివేండ్రం బయల్దేరాలి. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి. ఐదో రోజంతా త్రివేండ్రం సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి. ఆరో రోజు ఉదయం 7.25 గంటలకు త్రివేండ్రంలో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.45 గంటలకు చెన్నై చేరుకుంటారు. చెన్నైలో ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ టూరిజం సదరన్ డివైన్ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,350, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.33,770, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.43,330 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఇందులో కవర్ అవుతాయి. లంచ్, ఫ్లైట్‌లో మీల్స్, ఫ్లైట్ టికెట్ల ధరలో మార్పులు కవర్ కావు.

mahadsdsd-trip

ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మ‌రెందుకు ఆల‌స్యం మీ బ్యాగ్‌ స‌ర్దేయండి!

Read more about: visakhapatnam madurai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X