Search
  • Follow NativePlanet
Share
» »అవునండీ.. మ‌న దేశం సాహస క్రీడలకు చిరునామాగా నిలుస్తోంది!

అవునండీ.. మ‌న దేశం సాహస క్రీడలకు చిరునామాగా నిలుస్తోంది!

అవునండీ.. మ‌న దేశం సాహస క్రీడలకు చిరునామాగా నిలుస్తోంది!

మ‌న దేశం యొక్క‌ భౌగోళిక వైవిధ్యం అన్ని సీజన్లలోనూ సాహస క్రీడలను ఆస్వాదించడానికి అనువుగా ఉండేలా చేస్తుంది. ఈ క్రీడలకు ఊత‌మిచ్చేలా పర్వత శ్రేణులు, నదులు, తీర ప్రాంతాలు మరియు అడవులు మనకు పుష్క‌లంగా ఉన్నాయి.

అయితే, సాహ‌స‌ క్రీడలు ప్రమాదకరమైనవి కూడా. కాబట్టి జాగ్రత్తగా, నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేయాల్సి ఉంటుంది. మ‌న దేశంలో ట్రెక్కింగ్, పర్వతారోహణ, హిల్ క్లైంబింగ్, రివర్ క్రాసింగ్, బంగీ జంపింగ్, రివర్ రాఫ్టింగ్, పారా-గ్లైడింగ్ మరియు జెట్ స్కీయింగ్ వంటి అనేక రకాల సాహస క్రీడలు గురించి తెలుసుకుందాం.

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్ అనేది సాహసంతో పాటు కాలినడకన ప్రయాణం చేయాల్సిన క్రీడ‌. మీరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు సందర్శనా స్థలాలను ఆస్వాదించవచ్చు. తెలియని ప్ర‌దేశాల‌ సహజ సౌందర్యాన్ని అన్వేషించడానికి ట్రెక్కింగ్ ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది. అడ్వెంచరస్ ట్రిప్‌లకు వెళ్లేందుకు మ‌క్కువ చూపే యువ‌తీయువ‌కుల‌ను ట్రెక్కింగ్ ఎంత‌గానో ఆకర్షిస్తోంది. మ‌న దేశంలోని అన్ని రాష్ట్రాలలో ట్రెక్కింగ్ చేసేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానాలుగా కొండ ప్రాంతాలైన సిమ్లా, కసౌలి లాంటివి ముందువ‌రుస‌లో ఉంటాయి.

పర్వతారోహణ

పర్వతారోహణ

పర్వతారోహణ అనేది ఒక క్లైంబింగ్ క్రీడ. ఇందులో ఒక వ్యక్తి వివిధ క్లైంబింగ్ గేర్‌ల సహాయంతో ఎత్తును చేరుకునేందుకు ఉప‌క‌రిస్తుంది. ఇది ఒక అభిరుచి, క్రీడ మరియు వృత్తి కూడా ప్రాచుర్యం పొందింది. పర్వతారోహణలో రాక్-క్రాఫ్ట్, స్నో-క్రాఫ్ట్ మరియు స్కీయింగ్ వంటి అనేక విభిన్న ర‌కాలు ఉన్నాయి. భారీ పర్వత శిఖరాలను అధిరోహించి చాలా మంది పేరు సంపాదించారు. ప‌ర్య‌తారోహ‌ర‌ణ‌లో ప్రాముఖ్య‌త పొందిన ప్ర‌దేశం ఎవరెస్ట్ పర్వతం.

రివర్ క్రాసింగ్

రివర్ క్రాసింగ్

రివర్ క్రాసింగ్ కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రసిద్ధ క్రీడ. కులు, మనాలి మరియు రిషికేశ్ వంటి అనేక ప్రదేశాలలో ఇది ఎక్కువ‌గా మ‌నుగ‌డ‌లో ఉంది. అధిక ప్రవాహం కారణంగా నదిని దాటడం కష్టంగా ఉన్నప్పుడు ప్రాథమికంగా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. నదికి రెండువైపులా చివర్లలో తాడులు కట్టబడి ఉంటాయి. ఆ తాళ్లకు అమ‌ర్చిన గిల‌క‌ సాయంతో వ్య‌క్తులు న‌దులు దాటాల్సి ఉంటుంది.

బంగీ జంపింగ్

బంగీ జంపింగ్

బంగీ జంపింగ్ ప్రమాదకరమైన మరియు సాహసోపేతమైన క్రీడ. ఇక్కడ, ఒక వ్యక్తి నిపుణుల మ‌ధ్య చేయాల్సి ఉంటుంది. ఎత్త‌యిన ప్ర‌దేశం నుంచి కాళ్ల‌ను బ‌ల‌మైన ఫ్లెక్స్‌బుల్‌ తాడుతో క‌ట్టి, కింద‌కు దూకాల్సి ఉంటుంది. కింద ఉన్న నేల‌ను తాకుతున్న అనుభూతితో ఈ క్రీడ‌ను ఆస్వాదించ‌వ‌చ్చు.

రివర్ రాఫ్టింగ్

రివర్ రాఫ్టింగ్

రివర్ రాఫ్టింగ్ అనేది వివిధ స్థాయిలలో ప్రవహించే నీటిలో అల‌ల మ‌ధ్య సాగే, ఒక ర‌క‌మైన‌ వినోద కార్యకలాపం. ఈ క్రీడను నిర్వహించడానికి గాలితో నింపిన పడవను ఉపయోగిస్తారు. ఈ క్రీడను ప్రదర్శించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాఫ్టింగ్ చేసేటప్పుడు భద్రతకు సంబంధించిన ప్రతి విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్ని సీజ‌న్‌ల‌లో, ముఖ్యంగా వర్షాకాలంలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. రివ‌ర్ రాఫ్టింగ్‌ పర్యాటక ప్రదేశాలలో కేరళ, రిషికేష్ వంటివి పేరుగాంచాయి.

పారా గ్లైడింగ్

పారా గ్లైడింగ్

పారా గ్లైడింగ్ అనేది గ‌గ‌న వీధిలో ఎగిరే క్రీడ. ఒక వ్యక్తి దీన్ని ఒంటరిగా చేయవ‌చ్చు లేదా గైడ్ సహాయంతో కూడా చేయవచ్చు. మనాలిలోని సోలాంగ్ వ్యాలీ ఈ క్రీడకు చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే, నీటిపై చేసే మ‌రో సాహ‌స క్రీడ జెట్‌స్కీయింగ్‌. జెట్ స్కీ అనేది 100-200 HP కలిగిన పవర్డ్ స్కూటర్. ఈ క్రీడ నీటిలో హై-స్పీడ్ రైడ్‌ని ఆస్వాదించడమే.

Read more about: shimla kasauli mount everest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X